/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/TDP-MLA-Payyavula-Keshav-is-angry-with-the-AP-government-jpg.webp)
Payyavula Keshav:సీఎం తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణం చేయాలని జగన్ అంటున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా లేదు.. అందుకే సీఎం తర్వాత మంత్రులు ప్రమాణం చేశారని చెప్పారు. జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే.. ప్రతిపక్ష నేత కాదని అన్నారు. మొత్తం సభ్యుల్లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్షనేత హోదా ఇస్తారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉంటే కేబినెట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారని అన్నారు. 1984లో ఉపేందర్‌కు అసలు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పొందడానికి పదేళ్లు పట్టిందని పేర్కొన్నారు.