Vijayawada: అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేశారు : మంత్రి మేరుగ నాగార్జున టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి మేరుగ నాగార్జున. అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. గత పాలనలో అవమానాలు.. అవహేళనలు.. దాడులు చూశామని.. సీఎం జగన్ పాలనలో రాజ్యాధికారం పొందమని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 17 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vijayawada: విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బిఆర్.అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం రాష్ట్రంలో ఏర్పాటైందన్నారు. ఈనెల 19వ తేదీన విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డా.బి.ఆర్.అంబేద్కర్ అని.. అంబేద్కర్ భావజాలాన్ని భుజాన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డని కొనియాడారు. ఆయన భావజాలాన్ని జగన్ మోహన్ రెడ్డి పుణికిపుచ్చుకున్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో జగన్ తన పేరు లిఖించుకున్నారని కీర్తించారు. Also Read: ప్రియుడి కోసం బరితెగించిన భార్య.. భర్తపై భారీ స్కెచ్.. బలైనా అమాయకురాలు..! ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. గత పాలనలో అవమానాలు.. అవహేళనలు.. దాడులు.. చూశామని.. జగన్ మోహన్ రెడ్డి వల్లే రాజ్యాధికారం పొందగలిగామని పేర్కొన్నారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతానని జగన్ మోహన్ రెడ్డి చెప్పారని.. చెప్పినట్లుగానే 425 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని కామెంట్స్ చేశారు. సోషల్ జస్టిస్ అడ్వైజర్ జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ..అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు చచ్చిపోతుందని గగ్గోలు పెట్టారని..చంద్రబాబు, వెంకయ్య నాయుడు కోర్టుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ చదువులు చదువుకోవాలి..పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వీళ్లకు నచ్చదని మండిపడ్డారు. #minister-merugu-nagarjuna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి