/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Minister-malla-reddy-jpg.webp)
Minister Mallareddy Scooter: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) స్టయిలే వేరు. యూత్, సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న క్రేజే డిఫరెంట్. పలు మీటింగ్స్ లలో ఆయన చెప్పిన పాలమ్మిన.. పూలమ్మిన.. డైలాగ్ ఎంత ఫెమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ డైలాగ్ మీద ఓ మ్యూజిక్ డైరెక్టర్ పాట కూడా చేశాడంటే.. ప్రజల్లోకి అది ఎంతగా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా మల్లారెడ్డి చెప్పిన ఆ డైలాగ్ మీద రీల్స్ కూడా చేసి సందడి చేశారు యూత్. ప్రతిపక్షాల నేతలైతే పాలమ్మిన మల్లారెడ్డి నేడు కోట్లు ఎలా సంపాధించాడో చెప్పాలంటూ విమర్శలు కూడా గుప్పించారు. ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ పాలమ్మితే వచ్చినవి కాదని.. జనాల్ని, ప్రభుత్వ సొమ్ము దోచుకున్నదంటూ ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి:TS Congress: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల ఎప్పుడంటే?
ఇవన్నీ పక్కనపెడితే.. నిన్న మల్లారెడ్డి బోయిన్ పల్లి కంటోన్మెంట్ గ్రౌండ్ లో నిర్వహించిన దసరా వేడుకలకు (Dussehra Celebrations) వెళ్లారు. అక్కడ ఆయనకు తాను పాలు అమ్మిన స్కూటర్ (Scooter) కనిపించింది. దీంతో ఆ స్కూటర్ ను చూసిన మల్లారెడ్డి ఆగలేకపోయారు. వెంటనే ఆ స్కూటర్ ను ఎక్కి చక్కర్లు కొట్టారు. మామా.. ఇది నా పాలమ్మిన స్కూటర్ అంటూ అక్కడ ఉన్న వారితో ఆనందంగా చెబుతూ సందడి చేశారు.
ఇది కూడా చదవండి:Telangana Elections 2023: రాజగోపాల్ రెడ్డి రాజకీయం స్టైలే వేరయా!
ఆ స్కూటర్ ఓనర్ తో ఈ స్కూటర్ నాకు ఇచ్చేయ్.. ఎన్ని పైసలు కావాలన్నా ఇస్తా అంటూ అడిగారు మల్లారెడ్డి. బండి నడిపి 20 ఏళ్లయిందంటూ దానితో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మల్లారెడ్డి ఆ స్కూటర్ పై కూర్చోగానే అక్కడ ఉన్న యూత్ అంతా ఆయన చుట్టూ చేరి సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
/rtv/media/media_files/2025/07/28/charla-2025-07-28-14-31-48.jpg)