అక్బరుద్దీన్ ముసలోడివి అయ్యావు.. మంత్రి కేటీఆర్ సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సరదాగా జరుగుతున్నాయి. ఈసారి నేతల మధ్య వాడివేడి విమర్శలు లేవు. రెండో రోజు సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య ఓ ఫన్నీ ఇన్సిడెంట్ సభలో నవ్వులు పూయించింది.

New Update
అక్బరుద్దీన్ ముసలోడివి అయ్యావు.. మంత్రి కేటీఆర్ సెటైర్లు

KTR Comments on Akbaruddin Owaisi : అక్బరుద్దీన్‌పై కేటీఆర్ సెటైర్లు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) సరదాగా జరుగుతున్నాయి. ఈసారి నేతల మధ్య వాడివేడి విమర్శలు లేవు. రెండో రోజు సమావేశంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. సభలో అక్బరుద్దీన్ ప్రభుత్వంపై వేసిన కొన్ని ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిస్తూ జోక్స్ వేయడంతో సభలో నవ్వులు విరబూశాయి. కేటీఆర్ మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఇంతకుముందులా నువ్వు యువకుడి కాదని ముసలోడివి అయ్యావని వ్యాఖ్యానించారు. తాను కూడా ముసలోడిని అయ్యాను.. నీ బిడ్డ లాయర్ అయితే నా బిడ్డ కాలేజీలో చదువుతున్నాడని సరదా వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఉన్న నేతలు నవ్వుకున్నారు. ఇదే క్రమంలో మిమ్మల్ని మాత్రం సిల్వర్ జూబ్లీ చేసుకోనివ్వమని తెలిపారు. తాము చేసే అభివృద్ధితో మీరు చార్మినార్ దగ్గర ఎంజాయ్ చేస్తారని.. ఇది పక్కా అంటూ పేర్కొన్నారు.

కేసీఆర్ మన ముఖ్యమంత్రి..

మరోవైపు కాంగ్రెస్‌ నేతలపైనా సెటైర్లు వేశారు. మీ పార్టీలో ప‌ది మంది ఉండొచ్చు.. కానీ బ‌య‌ట రాష్ట్రానికి ఒక్క ముఖ్య‌మంత్రే ఉంటారు.. మీకు వేరే ముఖ్య‌మంత్రి లేరు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబుకు కౌంటర్లు ఇచ్చారు. జీరో అవ‌ర్‌లో సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ.. మెడిక‌ల్ కాలేజీల్లో క్యాన్స‌ర్ ట్రీట్‌మెంట్, జ‌ర్న‌లిస్టుల ఇండ్ల స్థ‌లాల అంశాల‌ను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకొచ్చారు. జ‌ర్న‌లిస్టుల ఇండ్ల స్థ‌లాల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంటే నాడు సీజేఐగా ఉన్న ఎన్‌వీ ర‌మ‌ణ‌తో సీఎం కేసీఆర్ దాదాపు 10 సార్లు స్వ‌యంగా మాట్లాడారని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్యను ప‌రిష్క‌రించండని మ‌న ముఖ్య‌మంత్రే స్వ‌యంగా మాట్లాడారన్నారు. మీకు కూడా ఆయనే ముఖ్యమంత్రి.. మీ పార్టీలో ప‌ది మంది ఉండొచ్చు.. కానీ బ‌య‌ట రాష్ట్రానికి ఒక్క‌రే ఉంటారు. అందుకే మ‌న ముఖ్య‌మంత్రి అని అంటున్నా అని కేటీఆర్ వ్యాఖ్యలతో స‌భ‌లో న‌వ్వులు పూశాయి.

గతంలోనూ ఇద్దరి మధ్య వాగ్వాదం - KTR Comments on Akbaruddin In the Past

గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్, అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. పాతబస్తీ మెట్రో ఏమైంది? అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులు జరుగుతున్నాయని ఇలా జరగడం చరిత్రలోనే మొదటిసారని వాదించారు. సీఎం, మంత్రులు కూడా అసలు అందుబాటులో ఉండరని ఆరోపించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని కౌంటర్ ఇచ్చారు.

Also Read: మీరు బీజేపీ ఎమ్మెల్యే కాదంటూ..రాజాసింగ్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు