/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ktr1-jpg.webp)
KTR Election Campaign in Metro: తెలంగాణ ఎన్నికలకు ఇంకా ఎన్నో రోజుల సమయం లేదు. ఈ క్రమంలోనే నాయకులందరూ తమ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ (KTR) ఏదోక విధంగా ప్రజలతో మమేకమవుతన్నారు. ఈ క్రమంలోనే ఆయన మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా ఆయన ప్రయాణికులతో ముచ్చటించారు. బీఆర్ఎస్ (BRS) అందిస్తున్న సంక్షేమ పథకాలన్నిటిని ప్రయాణికులకు వివరించారు. బీఆర్‌ఎస్ కి మరోసారి ఓటేసి గెలిపించాలని కోరారు.
మెట్రో ట్రైన్ ఖాళీగా లేకపోవడంతో ఆయన కొద్దిసేపు నిలబడే ఉన్నారు. ఆ గ్యాప్ లో కూడా ప్రయాణికులతో మాట్లాడారు. కేటీఆర్ అలా సడెన్ గా మెట్రోలో కనిపించడంతో చాలా మంది ఆయనతో సెల్ఫీలు దిగారు. కేటీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా వరుస పెట్టి రోడ్ షోలు, సభలో పాల్గొంటూ బిజీ బిజీ గా ఉన్నారు.
Also Read: బర్రెలక్కకు జాబ్.. దాడి చేసింది వాళ్లే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
ఆయన ఈరోజు మెట్రోలో ఓ సాధారణ వ్యక్తిలా ప్రయాణించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Minister KTR Travels In Hyderabad Metro Train | మెట్రో లో కేటీఆర్ | Minister KTR News | RTV News@KTRBRS#BRSParty #KTR #Hyderabad #Metro #TelanganaElection2023 #rtv #rtvnews pic.twitter.com/rNuqkHSwb8
— RTV (@RTVnewsnetwork) November 24, 2023
BRS Party Working President KTR travelled via the city’s metro today from Raidurgam to Begumpet. @KTRBRS #Telangana #TelanganaAssemblyElections pic.twitter.com/y8aZRYJuqb
— BhuvanagiriNaveen_BRS (@NKB_BRS) November 24, 2023