కోకాపేట్ లో 100 కోట్లకు ఎకరం పై అసెంబ్లీలో రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్..!

కోకాపేట్ లో 100 కోట్లకు ఎకరంపై మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో రియాక్ట్ అయ్యారు. ప్రత్యర్థి కాంగ్రెస్ కు చురకలంటిస్తూ సెటైర్లు వేశారు.హైదరాబాద్ నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ దేశంలో దూసుకెళుతోందని కొనియాడారు. కోకాపేట్ లో ఎకరం భూమి వంద కోట్లకు అమ్ముడు పోవడం వారికి చెంపపెట్టులాంటిదన్న మంత్రి కేటీఆర్.

కోకాపేట్ లో 100 కోట్లకు ఎకరం పై అసెంబ్లీలో రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్..!
New Update

కోకాపేట్ లో 100 కోట్లకు ఎకరంపై మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో రియాక్ట్ అయ్యారు. ప్రత్యర్థి కాంగ్రెస్ కు చురకలంటిస్తూ సెటైర్లు వేశారు.హైదరాబాద్ నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ దేశంలో దూసుకెళుతోందని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు అన్నీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. కోకాపేట్ లో ఎకరం భూమి వంద కోట్లకు అమ్ముడు పోవడం వారికి చెంపపెట్టులాంటిదన్నారు మంత్రి కేటీఆర్.

దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై లను మించి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళుతోందన్నారు. ఇంత అభివృద్ధి తెలంగాణ సర్కార్ చేస్తున్నా ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం కంటికి కనిపించడం లేదన్నారు. ఇక కోకాపేట్ భూముల వేలం చరిత్రలో సంచలన రికార్డుగా మారింది. గురువారం వేసిన వేలంపాటతో ఏకంగా ఎకరం భూమి వంద కోట్లు పలికి అందరికి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో భూములకు ఎంత విలువ ఉందో ఈ వేలం పాటతో మరోసారి బహిర్గతం చేసింది.

కేవలం 45.33 ఎకరాలు వేలం వేయగా తెలంగాణ సర్కార్ ఖజానాకు 3 వేల 319 కోట్లకు పైగా ఆదాయం చేరింది. మార్నింగ్ సెషన్ లో 6,7,8,9 ఫ్లాట్లకు ఆక్షన్ నిర్వహించగా రియల్ ఎస్టేట్ సంస్థలు ఎగబడి మరీ కొనేశాయి. దీంతో ఎకరం 68 కోట్లకు తగ్గకుండా అమ్ముడు పోయింది. ఇక నియోపోలీస్ లేఅవుట్ లో ఎకరానికి ఏకంగా 100.75 కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది. హెచ్ఎండీఏ ఇదే లేఅవుట్ లో ఇంతకు ముందు నిర్వహించిన వేలంలో ఎకరానికి గరిష్టంగా 60 కోట్లు రేటు పలకగా... గురువారం నాటి రెండో దశ దాన్ని మించిపోయింది.

అయితే హెచ్ఎండీఏ అన్ని ప్లాట్లలో భూములకు ఎకరానికి 35 కోట్ల కనీస ధరను నిర్ణయించింది. ఇక ఆన్ లైన్ బిడ్డింగ్ లో మొదటి నుంచి ఉత్కంఠభరితంగా పోటీ కొనసాగింది. అయితే సగటున ఎకరానికి 73.23 కోట్ల చొప్పున లభించినట్టు హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe