KTR Live: మా పాలన సంక్షేమానికి స్వర్ణయుగం.. మళ్లీ గెలిచేది మేమే: కేటీఆర్

రానున్న ఎన్నికల్లో మరో సారి తాము అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

KTR Live: మా పాలన సంక్షేమానికి స్వర్ణయుగం.. మళ్లీ గెలిచేది మేమే: కేటీఆర్
New Update

ఐదేళ్ల క్రితం కూడా మహాకూటమి అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఇంతే హడావుడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణలో మరో సారి గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. వందల మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) తెలంగాణ ఇచ్చిందన్నారు. సోనియా గాంధీని ఆనాడు రేవంత్ రెడ్డి బలిదేవత అని అన్న విషయాన్ని గుర్తు చేశారు. అత్యధిక ఉద్యోగాలను ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. టీఎస్పీఎస్సీ (TSPSC) వద్ద 30 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్‌ చేసుకున్నంత మాత్రాన వారంతా నిరుద్యోగులు కాదన్నారు. ఉద్యోగాలను సృష్టించడంలో బెంగళూరును దాటేశామన్నారు.
ఇది కూడా చదవండి: Khammam Politics: ఆందోళనలో పొంగులేటి.. చుక్కలు చూపిస్తున్న హైకమాండ్.. అసలేం జరుగుతోంది?

వారిలో చాలా మంది ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. తొమ్మిదేళ్ల తమ పాలనలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ మారిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తమ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని అన్నారు.

తాము చేసిన అప్పుల కారణంగా సంపద పెరుగుతోందన్నారు. పారిశ్రామిక రంగంతో పాటు పర్యావరణ రైతులకు 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.ఈ రోజు మీట్ ది ప్రెస్ కార్యాక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కింది వీడియోలో చూడండి.

#ktr #telangana-elections-2023 #telangana-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe