అప్పుడు రేవంత్‌.. ఇప్పుడు రేటెంత..

కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఎన్నికలంటే ఏటీఎం మాదిరి అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. కొత్త బట్టలు వేసుకుని ముఖ్య‌మంత్రి, మంత్రి తానంటే తాను అని పోటీ ప‌డుతూ సవాళ్లు విసురుతారని తెలిపారు. గతంలో రేవంత్‌ ను చూస్తే గుర్తుకొచ్చేది ఓటుకు నోటు అని.. ప్రస్తుతం నోటుకు సీటు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

New Update
MLA KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఎన్నికలంటే ఏటీఎం మాదిరి అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. కొత్త బట్టలు వేసుకుని ముఖ్య‌మంత్రి, మంత్రి తానంటే తాను అని పోటీ ప‌డుతూ సవాళ్లు విసురుతారని తెలిపారు. గతంలో రేవంత్‌ ను చూస్తే గుర్తుకొచ్చేది ఓటుకు నోటు అని.. ప్రస్తుతం నోటుకు సీటు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బుధవారం నాడు తెలంగాణ భవన్‌లో నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ను ఇప్పుడు అందరూ రేవంత్‌.. రేవంత్‌.. అనడం లేదని.. రేటెంత.. రేటెంత అంటున్నారని తెలిపారు. కొడంగల్‌లో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్‌ రెడ్డి.. మళ్లీ పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు.

గత ఎన్నికల సమయంలో కేసీఆర్‌ను ఓడించే వరకూ తాను గడ్డం తీయనని అప్పటి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శపథం చేశారని.. ఆ గడ్డం ఏమైందో ఎవ్వరికీ తెల్వదన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతుందన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. నల్లగొండ జిల్లాకు ఫ్లోరోసిస్‌ తప్ప ఏమిచ్చిందని ఫైర్‌ అయ్యారు. సీఎం కేసీఆర్‌ తొమ్మిదేళ్లలో తెలంగాణను నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దారని కేటీఆర్‌ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు