Minister KTR: నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న ఎన్నికల ప్రచారం వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో.. మంత్రి కేటీఆర్ సహా పైన ఉన్నవారంతా కింద పడిపోయారు. ముందు వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో.. కేటీఆర్ ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ కూడా సడెన్ బ్రేక్ వేశారు. దాంతో వాహనంపైన ఉన్న వారి బరువు తాళలేక.. గ్రిల్ విరిగిపోయింది. దాంతో మంత్రి కేటీఆర్ సహా పక్కనే ఉన్న ఎమ్మెల్యే జీవన రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి పూర్తిగా కింద పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురికీ స్వల్పంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి సహా ఇతర నేతలు పాల్గొన్నారు. బైక్స్, కార్లతో భారీ ర్యాలీగా వెళ్తుండగా.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచార వాహనంపై వెళ్తున్నారు. ఈ సమయంలో ముందున్న వాహనాలు ఒక్కసారిగా బ్రెక్ వేయడంతో.. వీరి వాహనం నడుపుతున్న కూడా బ్రేక్ వేశాడు. దాంతో ఓపెన్‌టాప్‌పై ఉన్న గ్రిల్స్‌పై భారం పడటంతో అవి కాస్తా విరిగిపోయి.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి సహా మరికొందరు కింద పడిపోయారు. జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి పూర్తిగా కింద పడిపోయారు. వీరికి స్వల్పంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. పాత ఆలూరు రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read:
బోధన్ ఎమ్మెల్యే నామినేషన్ కోసం స్కూటీపై వచ్చిన కవిత.. వీడియో వైరల్