Telangana Elections: రేవంత్‌ను పొల్లు పొల్లు తిట్టిన పొన్నాల లక్ష్మయ్య, కేటీఆర్.. ఏమన్నారంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్.. పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు సుదీర్ఘ కాలం పని చేసిన పొన్నాల లక్ష్మయ్యను వయసు కూడా చూడకుండా రేవంత్ అవమానించరాని అన్నారు. శనివారం పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు By Shiva.K 14 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్(Minister KTR).. పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు సుదీర్ఘ కాలం పని చేసిన పొన్నాల లక్ష్మయ్యను వయసు కూడా చూడకుండా రేవంత్ అవమానించరాని అన్నారు. శనివారం పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. పొన్నాలను రేవంత్ అవమానించిన తీరు పట్ల ప్రజలు చిదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ ఇప్పటికీ ఎన్నో పార్టీలు మారారని, రేపు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదన్నారు. ఎన్నో పార్టీలు మారిన రేవంత్ ఇతరులకు చెప్పడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందన్నారు. అసలు కాంగ్రెస్ వైఖరి ఎంటి? అని ప్రశ్నించారు మంత్రి కిరణ్ కుమార్. ఓటుకు నోటు కేసులో దొంగను పీసీసీ చైర్‌లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. డబ్బు సంచులకు సీట్లు అమ్ముకుంటున్నాడని, చిల్లరగా మాట్లాడుతున్నాడంటూ రేవంత్ తీరుపై నిప్పులు చెరిగారు కేటీఆర్. పొన్నాల లక్ష్మయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్‌తో పొన్నాల భేటీ అవుతారని అన్నారు. ఈ నెల 16వ తేదీన జనగామలో జరిగే బహిరంగ సభలో బీఆర్ఎస్‌లో చేరుతారని చెప్పారు. ఇదికూడా చదవండి: భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్ కేటీఆర్ అనంతరం పొన్నాల లక్ష్మయ్య కూడా మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో పదవులు కో ఆర్డినేషన్ కోసం మాత్రమే అని అన్నారు. రేవంత్ లాంటి దౌర్భాగ్యునిపై తాను మాట్లాడబోనని అన్నారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ లాంటి వాళ్ళు బ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చాక అయన ఎమ్మెల్యే గా ఎందుకు గెలవలేదు? అని ప్రశ్నించారు. పార్టీలో తాను ఒక్కడినే ఓటమి పాలు అయ్యనా? జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ బార్య ఓడిపోలేదా? అని ప్రశ్నించారు. అవమానాన్ని బరించలేకే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. తననుపై పరుష వ్యాఖ్యలు చేయడంపైనా పొన్నాల తీవ్రంగా స్పందించారు. 'సిగ్గుండే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా.. నా బ్యాగ్రౌండ్ ఏంటో రేవంత్ తెలుసుకోవాలి.. నేను పార్టీ కి చేసిన సేవలు కనుమరుగు చేసారు..జీహెఎంసీ ఎన్నికల్లో రేవంత్ తన పార్లమెంట్ పరిధిలో ఎన్ని గెలిచారు.. ఐకమత్యమే పార్టీ బలం ఈ విషయం రేవంత్ మర్చిపోయారు.' అని ధ్వజమెత్తారు. ఇదికూడా చదవండి: Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..? #telangana-elections-2023 #minister-ktr #tpcc-chief-revanth-reddy #ponnala-lakshmaiah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి