Kurnool : మంత్రి కొట్టు సత్యనారాయణ వర్సెస్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

శ్రీశైలం మహ క్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. అయితే, అభివృద్ధి పనులపై స్టేజిపైనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో, ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది.

Kurnool : మంత్రి కొట్టు సత్యనారాయణ వర్సెస్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
New Update

Kottu Satyanarayana Vs Shilpa Chakrapani: శ్రీశైలం మహ క్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. అయితే, అభివృద్ధి పనులపై స్టేజిపైనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ట్రస్ట్ బోర్డ్ లో తీర్మానించిన అంశాలను పరిగణనలోకి తోసుకొలేదు మంత్రి కొట్టు సత్యనారాయణ. శ్రీశైలంలో సత్రాలకు స్థలాలను కేటాయించే 50 లక్షలు డిపాజిట్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, 50 లక్షలు సత్రాల వారు కేటాయించలేరని.. దీనిపై మీ నిర్ణయం మార్చుకోండి అంటూ మంత్రి కొట్టుకు సెటైర్ వేశారు శ్రీశైలం ఎమ్మెల్యే, ట్రస్టు బోర్డు ఛైర్మన్, మెంబర్ విరూపాక్షయ్య.

Also Read: ‘మీ అరాచకాలను కాల్ రికార్డింగ్ తో సహా బయటపెడతా’ ఎమ్మెల్యే కు అఖిల ప్రియ వార్నింగ్

This browser does not support the video element.

దీంతో, విరూపాక్షయ్యపై మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. నేను మాట్లాడే సమయంలో మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు మైకు కింద పెడితే బాగుంటుంది అంటూ సీరియస్ అయ్యారు. దేవస్థానం వారు కట్టే కాటేజీకి 10 లక్షలు డొనేషన్ పెట్టినప్పుడు ప్రైవేట్ సత్రాలకి 50 లక్షలు పెట్టడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే శిల్పా వ్యాఖ్యనించారు. శ్రీశైలంలో 50 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చేవారు ఎవరు లేరు అంటూ మంత్రి పై మండిపడ్డారు ఎమ్మెల్యే .

50 లక్షలు కట్టించుకొని తిరిగి మళ్లీ వారివారి సత్రలకి ఇస్తాం అన్నపుడు 50 లక్షల డిపాజిట్ దేనికి అని ఎమ్మెల్యే శిల్ప ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే వి కాబట్టి నీ మాటకు నేను మర్యాద ఇస్తా కానీ ఎవరైనా డబ్బులు కట్టాల్సిందేనన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. బోర్డులో చేసిన తీర్మానాలను పట్టించుకోనప్పుడు, బోర్డ్ ఎందుకు పనికిమాలినడానికా అంటూ మంత్రి కొట్టుకు సెటైర్ వేశారు.

డొనేషన్లు, దేవస్థానం అభివృద్ధి పనులపై ఏమన్నా మాట్లాడాలి అంటే సీఎం జగన్ వద్ద మాట్లాడదాం అన్నారు మంత్రి కొట్టు. చిన్న చిన్న పనులకి సీఎం వద్దకు వెళ్లి మాట్లాడాలి అంటే నేను ఒప్పుకోను అని ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి కామెంట్స్ చేశారు. చివరలో మేము - మేము అంత ఒకటే అంటూ స్టేజ్ పై నుంచి వెళ్లిపోయారు మంత్రి కొట్టు సత్యనారాయణ.

#andhra-pradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe