New Liquor Policy: అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ

AP: నూతన మద్యం పాలసీపై కీలక ప్రకటన చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమలు చేస్తామన్నారు. ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.

బాధితులకు వందకు వందశాతం నష్టపరిహారం చెల్లించాల్సిందే.!
New Update

AP: నూతన మద్యం పాలసీపై కీలక ప్రకటన చేశారు మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra). అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ (New Liquor Policy) అమలు చేస్తామన్నారు. ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం నాసిరకం మందును అధిక ధరలకు విక్రయించారని మండిపడ్డారు. మేం నాణ్యతతో కూడిన లిక్కర్ అందిస్తామన్నారు.

మద్యం కుంభకోణంపై విచారణ..

ఏపీలో చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సీఐడి దర్యాప్తు కు ఆదేశిస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. జగన్ (YS Jagan) హయాంలో జరిగిన మద్యం కుంభకోణాలపై సభలో సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) పవర్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి ఈ కేసును ఈడీకి సైతం రిఫర్ చేస్తామన్నారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తు జరగాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు. మద్యం విషయంలో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లల్లో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయన్నారు. ఇది ఓ భయంకరమైన స్కాం అని అన్నారు. 

Also Read: అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ

#new-liquor-policy #chandrababu-naidu #kollu-ravindra
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe