Harish Rao Exclusive Interview : వంద సీట్లు గెలుస్తాం..కాంగ్రెస్‌ ను రనౌట్, బీజేపీని డకౌట్ చేస్తాం: హరీశ్ రావు సంచలన ఇంటర్వ్యూ

తెలంగాణలో ఈసారి వందసీట్లలో గెలవబోతున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ రనౌట్, బీజేపీ డకౌట్ ఖాయమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు..ఏర్పడిన తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు చూశారన్నారు. కాంగ్రెస్ పాలనలో కరువులు, కర్ఫ్యూలు ఉండేవన్నారు. తెలంగాణ నేడు పది రాష్ట్రాలకు అన్నం పెడుతుందన్నారు మంత్రి హరీశ్ రావు. ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో చూద్దాం.

Harish Rao Exclusive Interview : వంద సీట్లు గెలుస్తాం..కాంగ్రెస్‌ ను రనౌట్, బీజేపీని డకౌట్ చేస్తాం: హరీశ్ రావు సంచలన ఇంటర్వ్యూ
New Update

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. అధికార బీఆర్ఎస్ ప్రచారంతో హోరెత్తిస్తోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి హరీశ్ రావు ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్య్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి వంద స్థానాల్లో గెలవబోతున్నామని.... కాంగ్రెస్‌ రనౌట్, బీజేపీ డకౌట్ ఖాయమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పోటీ అంతా రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు... పదేళ్ల కాంగ్రెస్‌ పాలనను, వచ్చాక పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు చూశారు. కాంగ్రెస్‌ పాలనలో కరువు, కర్ఫ్యూలు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదు. తెలంగాణ ఇవాళ పది రాష్ట్రాలకు అన్నం పెడుతోంది. తెలంగాణ సమస్యలపై ఆనాడు ఏ కాంగ్రెస్ నేత మాట్లాడలేదు. ఇప్పుడేమో అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో టికెట్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హరీశ్ రావు అన్నారు.

ఇది కూడా చదవండి: వైఎస్ షర్మిల, డీకే శివకుమార్ వ్యూహం బెడిసి కొట్టిందా?

ఖమ్మంలో ఈ సారి మెజార్టీ స్థానాలు గెలవబోతున్నాం. గతంలో స్థానిక నాయకత్వంపై నమ్మక ముంచి ఫెయిలయ్యాం. కానీ ఈ సారి ఖమ్మం జిల్లాపై పార్టీ ప్రత్యేకదృష్టి పెట్టింది. ఈ సారి మెజార్టీ స్థానాలు ఖమ్మంలో గెలవడం ఖాయమన్నారు. ఈ దేశంలో వరుసగా రెండుసార్లు రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్. ఇంకా 3, 4 వేల కోట్లు మాఫీ కావాల్సి ఉంది. అది కూడా పూర్తవుతుంది. రైతులకు 72 వేల కోట్ల రైతు బంధు ఇచ్చాం. ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు హరీశ్ రావు.

ప్రవలిక విషయంలో ప్రతిపక్షాలు దిగజారాయి. బురదజల్లే ప్రయత్నం చేశాయి. కానీ ప్రవళిక సోదరుడు, తల్లి అసలు నిజాన్ని చెప్పారు. దేశంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుపై గతంలో స్పందించా. ఇప్పుడు కూడా చెప్తున్నా. కక్షపూరిత రాజకీయాలు మంచివి కావు. తెలంగాణలో ధర్నాలు చేయడానికి సమస్యలు లేకపోవడం వల్లే అవినీతి అంశాన్ని లేవనెత్తుతున్నారు. కేంద్రం పార్లమెంట్‌లో తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తుంది. ఇక్కడకు వచ్చి ఎన్నికల కోసం అవినీతి ఆరోపణలు చేస్తారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడం వెనుక పార్టీ స్ట్రాటజీ ఉంది. పార్టీ ఆదేశాల మేరకే రెండు చోట్ల పోటీ తెలంగాణలో ఎవరైనా పోటీ చేయోచ్చు. పవన్‌కల్యాణ్ పోటీ చేయోచ్చు. షర్మిల పోటీ చేయోచ్చు. ఎవరైనా పోటీ చేయోచ్చు అన్నారు.

ఇది కూడా చదవండి: ఆర్థిక పేదరికంలో మగ్గుతున్న సామాన్య జనం..!

కాళేశ్వరంపై కాంగ్రెస్‌, బీజేపీవి అర్ధం లేని ఆరోపణలు. ప్రాజెక్టుకు ఖర్చు చేసిందే 80 వేల కోట్లు. అలాంటిది లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది. పొంగులేటి,జూపల్లి, తుమ్మల పార్టీ నుంచి వెళ్లిపోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదు. వాళ్లు పెద్ద నాయకులైతే తుమ్మల మంత్రిగా ఉండి, పొంగులేటి ఎంపీగా ఉండి..బీఆర్ఎస్‌కు గతంలో ఎన్ని సీట్లు గెలిపించారు. జూపల్లి సొంత స్థానంలో ఎందుకు ఓడిపోయారు. తెలంగాణలో ఎన్నికలయ్యాక మహారాష్ట్రపై దృష్టి పెడతాం. అభివృద్ధి విషయంలో పక్క రాష్ట్రాలతో తప్పకుండా పోల్చుతాం. అంశాల వారీగా మాత్రమే బీజేపీకి లోక్‌సభలో మద్దతు తెలిపాం. రాష్ట్రపతి అభ్యర్తి విషయంలో వ్యతిరేకించాం. కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు తెలిపాం. కామన్‌ సివిల్‌ కోడ్‌ విషయంలోనూ కేంద్రాన్ని వ్యతిరేకించామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

#harish-rao-exclusive-interview
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe