తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. అధికార బీఆర్ఎస్ ప్రచారంతో హోరెత్తిస్తోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి హరీశ్ రావు ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్య్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి వంద స్థానాల్లో గెలవబోతున్నామని…. కాంగ్రెస్ రనౌట్, బీజేపీ డకౌట్ ఖాయమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పోటీ అంతా రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు… పదేళ్ల కాంగ్రెస్ పాలనను, వచ్చాక పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు చూశారు. కాంగ్రెస్ పాలనలో కరువు, కర్ఫ్యూలు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదు. తెలంగాణ ఇవాళ పది రాష్ట్రాలకు అన్నం పెడుతోంది. తెలంగాణ సమస్యలపై ఆనాడు ఏ కాంగ్రెస్ నేత మాట్లాడలేదు. ఇప్పుడేమో అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో టికెట్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హరీశ్ రావు అన్నారు.
పూర్తిగా చదవండి..Harish Rao Exclusive Interview : వంద సీట్లు గెలుస్తాం..కాంగ్రెస్ ను రనౌట్, బీజేపీని డకౌట్ చేస్తాం: హరీశ్ రావు సంచలన ఇంటర్వ్యూ
తెలంగాణలో ఈసారి వందసీట్లలో గెలవబోతున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ రనౌట్, బీజేపీ డకౌట్ ఖాయమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కూడా రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు..ఏర్పడిన తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ప్రజలు చూశారన్నారు. కాంగ్రెస్ పాలనలో కరువులు, కర్ఫ్యూలు ఉండేవన్నారు. తెలంగాణ నేడు పది రాష్ట్రాలకు అన్నం పెడుతుందన్నారు మంత్రి హరీశ్ రావు. ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో చూద్దాం.
Translate this News: