Gummanur Jayaram: వైసీపీ అధిష్టానంపై మంత్రి గుమ్మనూరు జయరాం అలక..! వైసీపీ అధిష్టానంపై మంత్రి గుమ్మనూరు జయరాం అలక చెందినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ను కలవాలని ప్రయత్నించిన ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు జయరాం హాజరు అవుతారా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. By Jyoshna Sappogula 03 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి Minister Gummanur Jayaram: వైసీపీ అధిష్టానంపై మంత్రి గుమ్మనూరు జయరాం అలక చెందినట్లు తెలుస్తోంది. క్యాబినేట్ సమావేశం తరువాత వైసీపీ అధిష్టానంతో గ్యాప్ పెరిగినట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ ను ప్రత్యేకంగా కలవాలని క్యాబినేట్ సమావేశం సందర్భంగా ప్రయత్నించిన ఆయనకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని అందుకే దూరంగా ఉంటున్నారని పలువురి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు అవుతారా..? లేదా..? అనే అనుమానం కలుగుతోంది. Also Read: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. తాటికొండ రాజయ్య రాజీనామా! ఇదిలా ఉండగా డీకే శివకుమార్ ద్వారా హస్తం పార్టీకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు డీకే శివకుమార్ ఏమో వయా తెలంగాణ సీఎం ద్వారా.. సైకిల్ ఎక్కేందుకు లాబింగ్ జరుపుతున్నారని సమాచారం. గుంతకల్లు టీడీపీ సీటు ఇచ్చేందుకు ఒకే అని సైకిల్ పార్టీ అంటుందని అయితే ఆలూరు కేటాయించాలని గుమ్మనూరు జయరాం పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతోంది. Also Read: తూర్పుగోదావరి జిల్లాలో అమానుషం..అనుమానంతో భార్యకు గుండు కొట్టించిన భర్త మరో వైపు నియోజకవర్గంలో వైసీపీ కొత్త ఇంచార్జీ విరూపాక్ష గేరుమార్చి స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. కంగ్రాట్స్ చెప్పలేదని ఆలూరు మండలాద్యక్షున్ని పదవి నుంచి తొలగించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆలూరు వైసీపీలో ఏం జరుగుతుందోనని కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. నేడు ముఖ్య కార్యకర్తలతో విరూపాక్ష సమావేశం నిర్వహించనున్నారు. #minister-gummanur-jayaram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి