Minister Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కౌంటర్లు వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు తక్కువ సీట్లు కేటాయించడంపై సెటైర్లు పేల్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్లలో ఇండస్ట్రియల్ పార్కుకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ శంకుస్థాపన చేశారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రూ. 20 కోట్ల అంచనాతో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేనపై తీవ్ర విమర్శలు చేశారు.
Also Read: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్ లో మార్పులు..!
రాష్ట్రంలో చంద్రబాబు వైసీపీ మినహా తన అవసరం కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాడని కామెంట్స్ చేశారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయమని సీఎం జగన్ అడుగుతుంటే.. పొత్తులు చూసి ఓటేయ్యాలని విపక్షాలు కోరుతున్నాయని కౌంటర్ వేశారు. పొత్తులు చూసి ఓటేయ్యాలా, అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయ్యాలా అనేది ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలకు ఓట్లు అడిగే అర్హతే లేదన్నారు. ఇలాంటి కూటములు ఎన్ని వచ్చినా జగన్‌ను టచ్ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: నటి ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. లైవ్ లో ఫోన్ కాల్స్ వినిపించిన భర్త..!
పాపం పవన్ కళ్యాణ్‌ను అమాయకుణ్ని చేసి సీట్లు తగ్గించారని ఎద్దేవా చేశారు. చివరకు సొంత అన్న నాగబాబుకు కూడా పవన్ కళ్యాణ్ సీటు తెచ్చుకోలేకపోయాడని విమర్శలు గుప్పించారు. జనసేనకు మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు తగ్గించేశారని.. చంద్రబాబేమో 145 సీట్లలో ఒకటైనా తగ్గించుకున్నాడా అని ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలకు, జనసేన నేతలకు ఏం సమాధానం చెప్తాడోనని అని గుడివాడ అమర్‌నాథ్ చురకలు వేశారు.