/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Minister-Buggana-Rajendrana-jpg.webp)
Andhhra Pradesh Assembly Session: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 21వ తేదీన ప్రారంభమవనున్నట్లు అసెంబ్లీ(AP Assembly) వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. సమావేశాల ఏర్పాట్లపై అసెంబ్లీలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 9 గంటలకు, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని మంత్రి బుగ్గన(Minister Buggana Rajendranath) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రత, వసతుల ఏర్పాట్లు, తదితర విషయాలపై చీఫ్ విప్, విప్ లతో చర్చించారు. అదే రోజు శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం, సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ ఏ అంశాలపై చర్చ జరగాలనే అంశాలపై నిర్ణయం జరుగుతుందన్నారు. శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని బుగ్గన తెలిపారు. గతంలో మాదిరిగానే ఈ సమావేశాలకు అధికార యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షలో చీఫ్ విప్ ముదునూరి నాగరాజ వర ప్రసాద రాజు, విప్ లు జంగా కృష్ణమూర్తి, కాపు రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నోటిఫికేష్ జారీ..
కాగా, సెప్టెంబరు 21వ తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశాల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ మేరకు ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 15వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ 11వ సమావేశాలు, ఏపీ శాసనమండలి 43వ సెషన్.. ఈ నెల 21న ప్రారంభం అవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
యుద్ధమే..?
కాగా, చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో జరుగుతున్న అసెంబ్లీ సెషన్‌పై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు సభలో ఎలా వ్యవహరిస్తారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు టీడీపీ నేతలు సభకు వస్తారా? వచ్చి సభలో తమ నిరసన గళాన్ని వినిపిస్తారా? అనేది బిగ్ టాపిక్ నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ వ్యతిరేకంగా సభలో నిరసన తెలిపే అవకాశం ఉందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ లోపు చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏపీ పాలిటిక్స్‌లో ఏం జరుగబోతోందో మరి చూడాలి.
Also Read:
KCR Letter: ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ.. ఆ బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి
INDIA Alliance: ఆ టీవీ యాంకర్స్‌ను బహిష్కరించిన ఇండియా కూటమి.. లిస్ట్ పెద్దదే..