ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. డ్యాన్సు చేసుకునే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా అవసరమా అంటూ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డ బొత్స…అవినీతి నిరూపించినట్లయితే తాను గుండు గీయించుకుంటానంటూ సవాల్ విసిరారు.
బుధవారం కత్తిపూడి సభలో సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ ధీటుగా సమాధానమిచ్చారు. రక్తపు మరకలు అంటిన సీఎం మనకు అవసరమా అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డ్యాన్సులు వేసుకునే వ్యక్తి మనకు సీఎంగా అవసరమా అంటూ ప్రశ్నించారు. సచివాలయాల్లో అవినీతి నిరూపించినట్లయితే తాను గుండు గీయించుకుంటానంటూ సవాల్ విసిరారు బొత్స సత్యనారాయణ.
ఇక ఏపీ సర్కార్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు బొత్స. హక్కుగా రావాల్సిన నిధులు తప్ప ఏపీకి కేంద్రం ఎలాంటి సాయం అందించలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు బొత్స. అసలు బుందేల్ ఖండ్ ప్యాకేజీ గురించి బీజేపీకి, అమిత్ షాకు తెలుసాంటూ నిలదీశారు. అమిత్ షా వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోవల్సిన అవసరం లేదన్నారు. ఏపీ డెవలప్ మెంట్ గురించి ఇక్కడి ప్రజలను అడుగుతే తెలుస్తుందన్నారు. విశాఖ ఉక్కును అమ్మేయడానికి కొత్త డ్రామాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.