Botcha Satyanarayana: చంద్రబాబుకు చెప్పే దమ్ముందా?.. మంత్రి బొత్స సవాల్

AP: చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరకు కూటమి నేతలు వ్యతిరేకమని చంద్రబాబుకు చెప్పగలరా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలని సవాల్ చేశారు.

New Update
Botcha Satyanarayana: చంద్రబాబుకు చెప్పే దమ్ముందా?.. మంత్రి బొత్స సవాల్

Minister Botcha Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తమ పార్టీ వ్యతిరేకం అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరకు వ్యతిరేకమని కూటమి నేతలు చెప్పగలరా.. చంద్రబాబుకు చెప్పే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలని సవాల్ చేశారు.

ALSO READ: మేఘా కృష్ణారెడ్డికి షాక్.. సీబీఐ కేసు నమోదు

స్టీల్ ప్లాంట్ డ్రామాలాడుతున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలని అన్నారు. టీడీపీ - జనసేన - బీజేపీకీ ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపినట్లే అని పేర్కొన్నారు. లాబీయింగ్ చేసే సీఎం రమేష్ కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడానికి స్థానికంగా ఉన్న బీసీ నేత టీడీపీకి దొరకలేదా? అని ప్రశ్నించారు. వాలంటీర్లపై చంద్రబాబు మాటలు చూస్తుంటే నాలిక తాటిమట్ట అనే విధంగా ఉన్నాయని విమర్శించారు.

జగన్ చెప్పిందే చేస్తారు..

జగన్ ఏదైతే చెప్తారో అదే చేస్తారు.. ఏదైతే చేస్తారో అదే చెప్తారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడని నాయకులని పేర్కొన్నారు. బీసీలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ వంటివారని తెలిపారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం జగన్ మాత్రమే ఇస్తున్నారని కొనియాడారు. మాత్యకారులను ఎమ్మేల్యేలుగా, మంత్రులుగా చేసే ఒకే ఒక్క నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో మత్స్యకారులకు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇచ్చారని గుర్తు చేశారు.

ఒక మత్స్యకారుడిని రాజ్య సభకు పంపించారని అన్నారు. బలహీనవర్గాలంటే చంద్రబాబుకు, పవన్ కు చిన్న చూపు అని ఫైర్ అయ్యారు. మాయలు చేసే మాటలు మేము చెప్పమని తేల్చి చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తులో జగన్ లాంటి మంచి నాయకుడిని చూడలేదని అన్నారు. మన పార్టీ బలహీనవర్గాల పార్టీ అని జగన్ తనతో అనేవారని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు