/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Ambati-Rambabu-on-pawan.jpg)
Minister Ambati: మూడు పార్టీలు కలసి పోటీ చేసినా సీఎం జగన్ ను ఓడించలేవని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజాగళం సభలో మైకు మూగబోతే దానికి పోలీసులు కారణమని సాకులు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజాగళం సభ ద్వారా ప్రజలకు ఏం సందేశమిచ్చారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. మూడు పార్టీల సభ అట్టర్ ప్లాప్ అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు తన రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతోనే సరిపోయిదన్నారు. సోషల్ మీడియాలో సైతం తనదైన శైలిలో కూటమిపై మంత్రి అంబటి కౌంటర్లు వేస్తున్నారు.
మైక్ ఫెయిల్ !
మీటింగ్ ఫెయిల్ !
టోటల్ గా ముగ్గురూ ఫెయిల్ !@ncbn @PawanKalyan @BJP4India— Ambati Rambabu (@AmbatiRambabu) March 17, 2024