Ambati Rambabu: వందమంది బాబులు వెయ్యి మంది పవన్ కళ్యాణ్ లు వచ్చినా సరే జగన్ ను ఓడించలేరు: అంబటి
వందమంది చంద్రబాబులు కలిసినా వెయ్యి మంది పవన్ కళ్యాణ్ లాంటి వారు వచ్చినా జగన్ ను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. పార్టీలకు అతీతంగా ఇంటి వద్దకే వచ్చి అన్ని పథకాలు అందించిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.
Minister Ambati Rambabu: పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీ , డ్వాక్రా రుణమాఫీ చేస్తానని, రైతులను భూములు వేలంపాట పెట్టించి మహిళల బంగారాన్ని పోగొట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. రుణమాఫీ కట్టొద్దని చెబుతూ.. సభలకు వచ్చిన ఆడవాళ్లను మీ మెడలో బంగారం లేదా.. తాకట్టులో ఉందా నాకు ఓటు వేయండి.. బంగారం విడిపిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు.
వందమంది చంద్రబాబులు కలిసిన వెయ్యి మంది పవన్ కళ్యాణ్ లాంటి వారు వచ్చినా జగన్ ను ఓడించలేరని ధీమ వ్యక్తం చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పింఛన్, అమ్మఒడి, రైతు భరోసా ఏ పధాకన్ని ఆపకుండా చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా ఇంటి వద్దకే వచ్చి అన్ని పథకాలు అందించారని కీర్తించారు.
జగన్మోహన్ రెడ్డిని ఓడించే వరకు పవన్ కళ్యాణ్ నిద్రపోను అంటున్నాడని.. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతాడో లేదంటే లోకేష్ అవుతారో తెలియదని అన్నారు. అందరూ కట్టకట్టుకుని వచ్చిన గెలుపు సీఎం జగన్ దేనని అన్నారు. చెప్పిన వన్నీ చేసి మళ్ళీ ఐదు సంవత్సరాలకు మీ ముందు ఓటు వేయమని అడుగుతున్నామని వ్యాఖ్యనించారు. మీ కుటుంబానికి లబ్ది జరిగితే ఓటు వేయమని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.

Also Read: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్..మెడలో మంగళసూత్రమే సాక్ష్యం!
వందమంది చంద్రబాబులు కలిసిన వెయ్యి మంది పవన్ కళ్యాణ్ లాంటి వారు వచ్చినా జగన్ ను ఓడించలేరని ధీమ వ్యక్తం చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పింఛన్, అమ్మఒడి, రైతు భరోసా ఏ పధాకన్ని ఆపకుండా చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా ఇంటి వద్దకే వచ్చి అన్ని పథకాలు అందించారని కీర్తించారు.
Also Read: తిరుపతిలో ధనుష్ సినిమా షూటింగ్ వివాదం