Minister Ambati: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ జనసేన పొత్తు అట్టర్‌ఫ్లాప్ అని విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెం సభలో ప్రజలకు ఏం సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. పవన్ షేరింగ్ గురించి మాట్లాడతారేమోనని అంతా ఎదురుచూశారని.. పవర్ స్టార్ అన్నారు కానీ.. పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదని కామెంట్స్ చేశారు.
Also Read: వైసీపీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇలా చేస్తోంది: పురందేశ్వరి
పవన్ కల్యాణ్ అంటే నటుడుగా తనకు మంచి గౌరవం ఉందన్నారు మంత్రి అంబటి. కానీ, అతను రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని.. పిచ్చి, పిచ్చి సినిమా డైలాగులు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానన్న పవన్.. ఇప్పుడు తనను ప్రశ్నించొద్దంటున్నాడన్నారు. జనసైనికులు పవన్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని ఎద్దేవ చేశారు. చంద్రబాబుని జైల్లో పెడితే బాధేసిందని పవన్ విలపించారని.. మరి వంగవీటి రాధను హత్య చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎందుకు బాధ కలగలేదు అని ప్రశ్నించారు. ముద్రగడను వేధించినప్పుడు బాధ కలగలేదా అని ప్రశ్నించారు. కాపు సోదరులంతా పవన్ గురించి ఆలోచించుకోవాలని సూచించారు.
Also Read: దమ్ముంటే జగన్ సమాచారం బయటపెట్టు..పవన్ కు పేర్నినాని సవాల్
నాదెండ్ల మనోహర్.. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లామని చురకలు వేశారు. సీఎం జగన్‌ను తొక్కేస్తానంటూ పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడాడని.. లేకుంటే తన పేరు పవన్ కల్యాణే కాదని అన్నారు. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కాలంటే.. పవన్ కళ్యాణ్ ను పుట్టించిన వాళ్లు రావాలన్నారు మంత్రి అంబటి. ఏది అనుకున్నాడో దాని గురించి నిలబడే నాయకుడు వైఎస్ జగన్ అని.. అలాంటి సీఎం గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కు లేదని హెచ్చరించారు. పవన్‌తో పొత్తు ఎందుకు పెట్టుకున్నానని చంద్రబాబే ఫీలవుతుంటాడన్నారు. మీ పొత్తు ఎలాంటిదో తాడేపల్లిగూడెం సభతోనే తేలిపోయిందని.. రాజకీయాల్లో పవన్ ఆటలో అరటి పండులాంటి వాడు అని మంత్రి అంబటి పేర్కొన్నారు.