Amarnath: ఆ కర్మ మా నాయకుడికి లేదు.. బీజేపీని ఎందుకు ఒప్పించలేకపొయారు..!

సీఎం జగన్ కు సింపతీ క్రియేట్ చేసుకోవాల్సిన కర్మ లేదన్నారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబు మాటలు చూస్తే అసహ్యం వేస్తుందన్నారు. జగన్ బస్సు యాత్రలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు.

New Update
Amarnath: ఆ కర్మ మా నాయకుడికి లేదు.. బీజేపీని ఎందుకు ఒప్పించలేకపొయారు..!

Gudivada Amarnath: గాజువాక నుంచి బరిలో ఉంటున్నట్లు తెలిపారు మంత్రి గుడివాడ అమర్నాథ్. నిన్న గాజువాకలో చంద్రబాబు మాటలు చూస్తే అసహ్యం వేస్తుందన్నారు. జగన్ బస్సు యాత్రలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. తమ నాయకుడికి సింపతీ క్రియేట్ చేసుకోవాల్సిన కర్మ లేదని పేర్కొన్నారు.

చేసిందేమీ లేదు..

చంద్రబాబు తాను సుదీర్ఘ ముఖ్యమంత్రి అని చెప్పుకోడమే కానీ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. మళ్ళీ ప్రజల్లోకివచ్చి జగన్ పై అప్రజాస్వామిక మాటలు మాట్లాడటం దారుణమన్నారు. జగన్ మనసును, ఆయన పాలన దక్షతను అందరూ అర్దం చేసుకున్నారని..ఒక్క చంద్రబాబుకే అర్దం కావడం లేదని కామెంట్స్ చేశారు.

Also Read: జగన్ పై దాడి చేసింది వాళ్లే.. దమ్ముంటే సీబీఐ చేత విచారణ జరిపించండి..!

ఒంటరిగా వచ్చిందే లేదు..

టీడీపీదే నేరచరిత్ర, ఎన్నో ఘటనలు టీడీపీలోనే జరిగాయని ఆరోపించారు. వెన్నుపోటు ద్వారా అధికారం వచ్చింది తప్ప ప్రజల మద్దతుతో ఒంటరిగా అధికారంలోకి వచ్చిన సందర్భం చంద్రబాబుకి లేదని వ్యాఖ్యానించారు. విశాఖ పట్టణానికి ఎన్నో కంపెనీలు తెచ్చామన్నారు. మైండ్ లెస్ కొడుకుని పక్కన పెట్టుకొని చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.

తాకట్టు పెట్టాడు

దావోస్ అన్ని సార్లు వెళ్ళిన చంద్రబాబు ఎం సాధించాడు? అని ప్రశ్నించారు. గాజువాకలో మీటింగ్ పెట్టి, స్టీల్ ప్లాంట్ విషయంలో మీ స్టాండ్ ఏంటో ఎందుకు చెప్పలేదని అడిగారు. వైసీపీ ఎప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతునే ఉందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ ప్లాంట్ పై పోరాటం చేస్తారట అని ఎద్దేవ చేశారు. బీజేపీని ఎందుకు ఒప్పించలేకపొయావని నిలదీశారు. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టాడని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు