kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్,కాంగ్రెస్ కు మధ్యవర్తిగా ఎంఐఎం వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కూడా కుంటుంబ పార్టీలేనన్నారు. కేసిఆర్ చేతిలో ఉన్న అన్ని వస్తువుల ధరలను ఆయన పెంచారన్నారు. ఇక భూములు అమ్మనిదే కేసీఆర్ ప్రభుత్వం నడిచే స్థితిలో లేదన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్నారు కిషన్ రెడ్డి. రాజకీయ అవసరాల కోసం ముందస్తు లిక్కర్ టెండర్లుకు పిలిచారని ఆయన మండిపడ్డారు.
ప్రజల ఆరోగ్యం చూడకుండా బీర్, బ్రాందీ అమ్మి ప్రజల రక్తం కేసీఆర్ తాగుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఒక చేతిలో ఆసరా పెట్టీ .. మరి చేతిలో బీర్ బ్రాందీ తో ఆ ఆసరా పెన్షన్ ను కేసీఆర్ కొట్టేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కేసిఆర్ ఇష్టా రాజ్యాంగ భూములు అమ్ముతున్నారన్నారు కిషన్ రెడ్డి. ఇక పేదల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వం దగ్గర స్థలం ఉండదన్నారు.. అదే అమ్ముకోవడానికి మాత్రం భూములు దొరుకుతున్నాయని ఆయన మండిపడ్డారు.
ఒప్పందంతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఆఫీసులకు స్థలం తీసుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం వికాస్ రావు లాంటి దంపంతులు బీజేపి పార్టీలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తాత్కాలిక అవసరాల కోసం రోడ్లను తాకట్టు పట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలతో దివాలా తీసే పరిస్థితి వచ్చిందన్నారు. కేసిఆర్ కుటుంబం నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
వికాస్ దంపతుల వలే రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు, మేదావులు బీజేపీలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వికాస్ రావు దంపతులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. మోడీ నాయకత్వంలో ప్రజలకు సేవ చేసేందుకు పార్టీలోకి చెన్నమనేని దంపతులు రావడం శుభపరిణామన్నారు. వంట గ్యాస్ ధర తగ్గింపు పై బీఆర్ఎస్ నేతలు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు ఆయన. గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు ప్రధాని తగ్గించారని ఆయన గుర్తు చేశారు. ప్రధాని పిలుపుతో అనేక రాష్ట్రాలు కూడా వీటి ధర తగ్గించాయన్నారు.
కానీ తెలంగాణలో మాత్రం ఒక్క రూపాయి తగ్గించని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్యాస్ ధర తగ్గింపు పై మాట్లాడటం గురి గింజ మీద సామెత లా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర ల మీద మాట్లాడే నైతిక హక్కు వాళ్లకి లేదన్నారు. ఇక తెలుగు ప్రజలందరికి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ పండుగ సందర్బంగా వంట గ్యాస్ ధరను మోడీ 200 రూపాయలను తగ్గించారని.. దేశంలోనే ఒకేసారి ఇంత ధర తగ్గించడం ఇదే మొదటిసారి అన్నారు ఆయన.
ఇది కూడా చదవండి..కేసీఆర్ ఎమ్మెల్యేలను.. పశువులను సంతంలో కొన్నట్టుగా కొనుగోలు చేశారు:జూపల్లి