నేటి ప్రపంచంలో ఇంటర్నెట్ ఎంత ముఖ్యమైనది అంటే..జీవితంలో ఓ భాగం. పది నిమిషాలు నెట్ ఆగిపోతేనే ప్రపంచం మొత్తం ఆగిపోయినట్లు బాధపడతాం. అలాంటిది ఏకంగా 12 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతే...ఇక అంతే సంగతులు. సరిగ్గా ఈ పరిస్థితి ఆస్ట్రేలియా లో చోటు చేసుకుంది.
బుధవారం ఒక్కసారిగా ఆస్ట్రేలియాలో ఇంటర్నెట్ కు అంతరాయం ఏర్పడింది.వివరాల్లోకి వెళ్తే... దేశంలోని ఓ ప్రముఖ టెలి కమ్యూనికేషన్స్ సంస్థ ఆప్టస్ నెట్ వర్క్ వైఫల్యం కారణంగా మిలియన్ల కొద్ది ఆస్ట్రేలియన్లు ఇంటర్నెట్ లేకుండా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అంతర్జాల సేవలు నిలిచిపోవడంతో అటు రవాణా సేవలు, మెడికల్ ఎమర్జెన్సీ సేవలు ఒక్కసారిగా ఆగిపోయాయి.దేశంలోనే అతి పెద్ద రెండో నెట్ వర్క్ ప్రొవైడర్ అయినటువంటి ఆఫ్టస్ లో సాంకేతిక సమస్యలు వల్ల దేశంలో 12 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
దీంతో వేలాది వ్యాపార లావాదేవీలు ఆగిపోయాయి. వాటిని పునరుద్దరించేందుకు నిపుణులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అంతర్జాల సేవలు నిలిచిపోవడం పై ఎలాంటి సైబర్ దాడులు జరగలేదని..కేవలం సాంకేతిక లోపం వల్లే మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయని ఆప్టస్ ప్రకటించింది.
అంతర్జాల సేవలను తిరిగి పునరుద్దరించేందుకు మా బృందాలు చాలా కష్టపడ్డాయని సంస్థ తెలిపింది. తమ సంస్థలో తగినంత మంది ఉద్యోగులు లేకపోవడం వల్లే సేవలు పునరుద్దరించేందుకు కొంచెం కష్టపడాల్సి వచ్చిందని కొందరు అంటుంటే..అలాంటిది ఏమి లేదని ఆప్టన్ సంస్థ ప్రకటించింది.
Also read: నటించలేదు..జీవించాడు..బన్నీకి బిగ్ బి ప్రశంసలు!