Chitti Babu: వైసీపీ ఎమ్మెల్యేకు బ్రెయిన్‌ స్ట్రోక్.. ప్రస్తుతం అబ్జ్వరేషన్‌లో..!

వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు...తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కుడికాలు లాగడంతో కుటుంబ సభ్యులు రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి "మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్" గా నిర్దారించడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో హుటాహుటిన హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. కొండేటి చిట్టిబాబు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... పి.గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

New Update
Chitti Babu: వైసీపీ ఎమ్మెల్యేకు బ్రెయిన్‌ స్ట్రోక్.. ప్రస్తుతం అబ్జ్వరేషన్‌లో..!

Chitti Babu: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు(Kondeti Chittibabu) సడన్‌గా అస్వస్థతకు గురయ్యారు. కుడికాలు లాగడంతో సహచరులు.. వెంటనే రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు...మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్‌(Mild Brain Stroke)గా నిర్దారించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్సులో హుటాహుటిన హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. మూడు రోజుల పాటు అబ్జ్వరేషన్‌లో పెట్టినట్టు సమాచారం. ఎమ్మెల్యే ఆరోగ్య విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు.

నిన్న సాయంత్రం వరకు ఆరోగ్యంగానే:
ప్రస్తుతం మారుతున్న జీవన శైలితో ఆరోగ్యం ఏ సమయంలో ఎలా ఉంటుందో చెప్పడం కష్టంగా మారింది. సడన్‌గా ఏదో ఒకటి జరగడం.. ఆస్పత్రిపాలవడం ఎక్కువగా జరుగుతోంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికీ అనేకసార్లు చూశాం. చిట్టిబాబు విషయంలోనూ అదే జరిగింది. 'జగ్గంపేట ఎమ్మెల్యే కూతురు వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి సీఎం జగన్‌ గారికి నిన్నటి రోజున స్వాగతం పలకడం జరిగింది' అని నిన్న చిట్టిబాబు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అక్కడ కూడా ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించారు. అంతకముందు రోజు 'రక్షాబంధన్ శుభాకాంక్షల అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ళ ప్రేమానురాగాలకు ప్రతీకైన రాఖీ పౌర్ణమి సందర్భంగా తోబుట్టువుల బంధం కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ శుభాకాంక్షలు' అని పోస్ట్ పెట్టారు. ఇక నాలుగు రోజుల క్రితం అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అటు మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామంలో 84.00 లక్షల AIIB గ్రాంట్‌తో వేస్తున్న రోడ్ల పనులను పరిశీలించి నాణ్యతలో ఎక్కడ లోపం లేకుండా చూడాలని ఆదేశించారు.

చాలా రోజుల నుంచి చురుగ్గా చిట్టిబాబు:
ఇటివలి కాలంలో అనే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు చిట్టిబాబు. వారం రోజుల క్రితం 23.94 లక్షల రూపాయలతో మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి లంక వంతెన నుంచి అదుర్రు వరకు సుమారు ఒక కోటి 40 లక్షల రూపాయలతో వేస్తున్న రోడ్డు పనులు పరిశీలించారు. ఆగస్టు 24న లబ్బిపేటలోని SS కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన మంత్రి శ్రీ జోగి రమేశ్‌ కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరై ఆశీర్వదించారు. ఆగస్టు 23న పి.గన్నవరం నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి 32 కోట్లు మంజూరు ఐనట్టు ప్రజలకు తీపి కబురు అందించారు. ఇక పది రోజుల క్రితం అయినవిల్లి మండలంలో శానపల్లిలంక గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక ఆగస్టు 20న మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో నగరం గ్రామ సచివాలయం కన్వీనర్ మట్ట బాబికుటుంబ సభ్యుల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.. అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామ సర్పంచ్ శ్రీ సలాది బుజ్జి కుటుంబ సభ్యులు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధురులను ఆశీర్వదించారు. ఇంత చురుగ్గా ఉన్న చిట్టిబాబు ఉన్నట్టుండి అస్వస్థకు గురవడం ఆయన అభిమానులను కలవరపెట్టింది. అయితే భయపడాల్సిందేది లేదని ఆయన కుటుంబసభ్యులు స్పష్టం చేశారు.

ALSO READ: సీఎండీ ప్రభాకర్ రావు సంతకం ఫోర్జరీ.. ఆర్టీవీ చేతికి చెక్కిన నకిలీ అపాయింట్మెంట్ లెటర్

Advertisment
Advertisment
తాజా కథనాలు