Satya Nadella: టైమ్ మ్యాగజైన్‌ లో మైక్రోసాఫ్ట్‌ CEO సత్య నాదెళ్ల..!

టైమ్ మ్యాగజైన్‌ 2024లో ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయులు చోటు సంపాదించారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌, రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, నటుడు దేవ్‌ పటేల్‌ తదితరులు ఉన్నారు.

New Update
Satya Nadella: టైమ్ మ్యాగజైన్‌ లో మైక్రోసాఫ్ట్‌ CEO సత్య నాదెళ్ల..!

Satya Nadella: మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు ప్రపంచంలోనే 100 మంది ప్రభావశీలుర జాబితా-2024లో చోటు సంపాదించారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, మైక్రోసాఫ్ట్‌ CEO సత్య నాదెళ్ల, బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌, రెజ్లర్‌ సాక్షి మాలిక్‌, నటుడు దేవ్‌ పటేల్‌ తదితరుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాను టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసింది.

Also Read:  కొత్త ఇల్లు కానీ అద్దెకు కానీ తీసుకుంటున్నారా..? అయితే 5 వాస్తు రూల్స్ మీకోసమే!

ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్‌ CEO సత్య నాదెళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులకు మెరుగైన సేవలిందించేందుకు ఎంతో కృషి చేస్తోంది. సత్య నాదెళ్ల సీఈవోగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది ఫిబ్రవరితో పదేళ్లు ముగిసింది. ఈ కాలంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు.

Also Read: ఈ కీటకాలు పాములకంటే ప్రమాదకరమైనవి.. వీటికి దూరంగా ఉండటం మంచిది..!

ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్‌ కంప్యూటింగ్‌, AIపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ మరింత పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్‌ వాటాదార్ల సంపద సుమారు 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. సత్య నాదెళ్ల CEOగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్‌ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు అయ్యేదని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు