Plastic: ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్..అన్ని బ్రాండ్లలో ఇదే తంతు

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తాపత్రయపడుతున్నాం కానీ మరోవైపు అవే తింటున్నాం. దేశంలో మనకు దొరుకుతున్న అన్ని బ్రాండ్ల ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్స్ ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. టాక్సిక్స్‌ లింక్‌ అనే పర్యావరణ పరిశోధన సంస్థ జరిపిన అధ్యయనంలో ఇది తేలింది.

New Update
Plastic: ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్..అన్ని బ్రాండ్లలో ఇదే తంతు

Micro Plastic: మనం రోజూ ప్లాస్టిక్‌ను తింటున్నాం. ఇప్పటికే చాలా పదార్ధాల్లో ప్లాస్టిక్‌ను కలుపుతున్నారని తేలింది. ఇప్పుడు ఉప్పు. చక్కెరల్లో కూడా ఇది ఉందని తెలుస్తోంది. టాక్సిక్స్‌ లింక్‌’ అనే పర్యావరణ పరిశోధన సంస్థ ‘మైక్రో ప్లాస్టిక్స్‌ ఇన్‌ సాల్ట్‌ అండ్‌ షుగర్‌’ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో దేశంలో అమ్ముతున్న అన్ని బ్రాండ్ల ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్ ఉందని తెలిసింది. పెద్ద , చిన్న బ్రాండ్ అని లేకుండా అన్నింటిలోనూ ప్లాస్టిక్ ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉప్పు, చక్కెరల్లో మైక్రో ప్లాస్టిక్స్ కలిసి ఉంటున్నాయి. దీంతో ఇవి మనం గుర్తించలేనంత చిన్నగా మన కడుపుల్లోకి వెళుతున్నాయి. అయితే ఇవి వెంటనే మన శరీరానికి ఏమీ ఎఫెక్ట్ చూపించకపోయినా..కొన్నేళ్ళకు రోగాలకు దారి తీయొచ్చని చెబుతున్నారు.

ఉప్పు, చక్కెరల్లో పలు రూపాల్లో మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయి. అవి ఫైబర్, పెల్లెట్స్, ఫిల్మ్స్, ఫ్రాగ్మెంట్స్‌ రూపంలో కనిపించాయి.ఈ మైక్రో ప్లాస్టిక్స్‌ సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకూ ఉన్నాయి. అయోడైజ్డ్‌ ఉప్పులో అత్యధిక స్థాయిలో మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయి. అవి బహుళ రంగుల పల్చటి ఫైబర్, ఫిల్మ్స్‌ రూపంలో కనిపించాయి. అంతేకాదు టేబుల్ రాక్, సముద్ర, స్థానిక ముడి ఉప్పుల్లోనూ వీటిని కనుగొన్నారు. ఒక కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.15 వరకు మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నట్లు అధ్యయనంలో తెలిసింది. మనం ఎక్కువగా వాడే అయోడైజ్డ్‌ ఉప్పులోనే ఇవి ఎక్కువ సంఖ్యలో 89.15 ఉంది. ఇక ఆర్గానిక్‌ రాక్‌ సాల్ట్‌లో అతి తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయి. అలాగే కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నట్లు తేలింది. ఆర్గానికేతర చక్కెరలోనే ఇవి అధికంగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

Also Read: Independence Day: నేటి స్వాతంత్య్ర దినోత్సవ థీమ్ వికసిత భారత్

Advertisment
తాజా కథనాలు