బీభత్సం సృష్టించిన మిచోంగ్ తుపాన్..!

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రైతులపై మిచౌంగ్‌ తుపాను నీళ్లు చల్లింది. ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాలలో మిచోంగ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చేతికి వచ్చిన పంట నీటి పాలైంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

New Update
బీభత్సం సృష్టించిన మిచోంగ్ తుపాన్..!

Michaung Cyclone Effect: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రైతులపై మిచౌంగ్‌ తుపాను నీళ్లుచల్లింది. కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాలలో మిచోంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. సముద్ర తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. వేగంగా వీస్తున్న గాలలుకు కొబ్బరిచెట్లు ప్రమాదకరంగా ఊగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Also read: మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణకు రెడ్ అలెర్ట్.!

ఖరీఫ్ సీజన్ కావడంతో తక్కువ ఖర్చుతో పంట చేతికి వచ్చిందని ఆశపడ్డారు అన్నదాతలు. తీరా పంట చేతికి వచ్చే సమయం‌లో మిచౌంగ్‌ రూపంలో వచ్చి‌న తుపాను రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ఒక పక్క చేతికి వచ్చిన పంట పొలాలలోనూ, కళ్లాలలోనూ ఉండిపోవడంతో రైతులకు ఏమిచేయాలో పాలుపోవడంలేదు. కోసిన పంట‌ పూర్తిగా నీట పాలైంది. కళ్లంలో నూర్పిడి చేసిన ధాన్యం రాసులు కూడా నీట మునిగిపోయాయి. దీంతో, రైతులు ఆందోళన చెందుతున్నారు.

Also read: రెచ్చిపోయిన కౌశిక్‌రెడ్డి.. సీరియస్ యాక్షన్ తీసుకున్న సీపీ.!

ధాన్యంలో కొంచెం తేమశాతం ఉంటే ప్రభుత్వం ధాన్యం‌ కొనేందుకు ముందుకు రావడం లేదని. షావుకార్లకు అమ్ముకుందామంటే దళారీ వ్యవస్థ అంటూ రైతుల నుండి షావుకార్లను ప్రభుత్వం దూరం చేసిందని వాపోతున్నారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా మా పరిస్థితి ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు ఇలాగే ఉంటే ధాన్యం కళ్లాలలోనూ, పంట పొలంలోనూ మొలకెత్తుందని అప్పుడు ధాన్యం కొనే నాధుడు ఉండడని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు