Michael Jakson Biopic:ప్రపంచంలోని టాప్ 100 పాప్ గీతాల్లో 13 పాటలు మైఖేల్ జాక్సన్‌వే. మరే సంగీతకారుడి ఈ రికార్డ్ లేదు. మైఖేల్ జాక్సన్ కెరీర్లో అమ్ముడైన ఆల్బమ్‌ల సంఖ్య అక్షరాలా 75 కోట్లు. 39.31నిమిషాల పాటూ ఉండే జాక్సన్ చేసిన ఘోస్ట్ అనే వీడియో ఆల్బమ్ ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన వీడియో ఆల్బమ్ గా పేరు పొందింది. సోలో కళాకారుడుగా మైఖేల్ సాధించిన ప్రపంచ ఖ్యాతి మాటల్లో చెప్పలేము. అక్షరాల్లో పొందుపరచలేము.కేవలం గాయకుడిగానే కాక గీత రచయితగా, డాన్సర్‌గా ప్రేక్షక హృదయాలపై జాక్సన్ చెరగని ముద్రవేశాడు.
Also Read:Telangana BJLP Leader:తెలంగాణ బీజెఎల్పీ నేతగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
పాటలే ఊపిరిగా బతికిన మైఖేల్ జాక్సన్ 2009లో చనిపోయాడు. ఇతని తర్వాత ఇలాంటి పాప్ గాయకుడు ఇప్పటి వరకూ రాలేదు. అయితే ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను వెండితెర మీదకు తెస్తున్నారు. 2025లో ఈ సినిమా విడుదల అవనుంది. దీనిలో మైఖేల్ జాక్సన్ పాత్రను అతని మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు. ఈసినిమాను లయన్స్ గేట్, యూనివర్శల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఫస్ట్ లుక్ రిలీజ్...
మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దీన్ని చూసిన వారందరూ వావ్ అని అంటున్నారు. ఏంటి జాక్సన్ మళ్ళీ పుట్టాడా అని అడుగుతున్నారు. ఇందులో నటిస్తున్న జాక్సన్ మేనల్లుడు జాఫర్ అచ్చు గుద్దినట్టు అతనిలానే ఉండడమే ఇందుకు కారణం. మ్యాన్ ఇన్ ది మిర్రర్'లో పాప్ రాజుగా ఉన్నట్టు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. దీనిని కెవిన్ ముజూర్ అనే ఫోటోగ్రాఫర్ తీశారు. మైఖేల్ జాక్సన్ తన దిస్ ఈజ్ ఇట్ కాన్సర్ట్‌కు సిద్ధమైనప్పుడు అతని రిహార్సల్స్‌ను రికార్డ్ చేసిన ఫోటోగ్రాఫర్‌లలో ఇతను ఒకరు.
మళ్ళీ పాతరోజుల్లోకి వెళ్ళినట్టు ఉంది...
మళ్ళీ పాతరోజుల్లోకి వెళ్ళిపోయానా అనుకున్నాను ఒక్కసారి అంటున్నారు జాఫర్ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ కెవిన్ మజూర్. జాఫర్ అచ్చు మైఖేల్ జాక్సన్ లానే ఉన్నాడని..బయోపిక్ సెట్‌లోకి వెళ్ళినప్పుడు తాను మళ్ళీ మైఖేల్ జాక్సన్‌తో టూర్‌కు వెళ్ళానా అనిపించిందని చెబుతున్నారు. జాఫర్ ప్రతీ కదలిక, చేసే ప్రతీ పనీ మైఖేల్‌లానే ఉందని ప్రశంసిస్తున్నారు. మైఖేల్ జాక్స్న్‌ను ప్రత్యక్షంగా ఎవరు చూడలేదో వారందరూ జాఫర్‌లో మైఖేల్‌ను చూసుకోవచ్చని చెబుతున్నారు.
మైఖేల్ జాక్సన్ బయోపిక్ కు ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 18న విడుదల అవనుంది.