మెక్సికో భూప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై 6.3తీవ్రత...!!

New Update
Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు

సెంట్రల్ మెక్సికోలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు అయ్యింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. సెంట్రల్ మెక్సికో తీరంలో ఈ ఉదయం 2:00 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

publive-image
మెక్సికోలో భూకంపం సంభవించింది.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదు అయ్యింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఈరోజు తెల్లవారుజామున 2:00 గంటలకు సెంట్రల్ మెక్సికో తీరంలో భూకంపం సంభంవించినట్లు పేర్కొంది.

మేలో రెండుసార్లు భూకంపం:
గత నెలలో కూడా మెక్సికోలో రెండు సార్లు భూమి కంపించింది. మే 25న పనామా-కొలంబియా సరిహద్దుకు సమీపంలో ఉన్న కరేబియన్ సముద్రంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.

6.4 తీవ్రతతో భూకంపం:
ఇది కాకుండా మెక్సికోలో మే 18న కూడా భూకంపం వచ్చింది. ఆ సమయంలో భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. గ్వాటెమాలలోని కెనిలా మున్సిపాలిటీకి ఆగ్నేయంగా 2 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు