/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/alert-1.jpg)
Cyclone Remal Alert: రెమాల్ తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో తీరంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. రెమాల్ తీవ్ర తుపాన్‌గా మారి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవులకు ఆగ్నేయంగా 270 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమైంది.
Also Read: టీడీపీ అభ్యర్థి అత్యుత్యాహం.. మంత్రి రోజా సీరియస్..!
ఇవాళ అర్ధరాత్రి సాగర్, ఖేపుపరా దీవుల మధ్య తుపాన్ తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గటంకు 110-120 కీలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. ఏపీతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.