TDP: టీడీపీ అభ్యర్థి అత్యుత్యాహం.. మంత్రి రోజా సీరియస్..!

నగరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యుత్యాహం ప్రదర్శించారు. పుత్తూరులో బ్యాడ్మింటన్‌ కోర్టు ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే భానుప్రకాష్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఎన్నికల ఫలితాలు రాకుండానే ఎమ్మెల్యే పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేయడంపై రిటర్నింగ్ ఆఫీసర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

New Update
TDP: టీడీపీ అభ్యర్థి అత్యుత్యాహం.. మంత్రి రోజా సీరియస్..!

TDP Gali Bhanuprakash: నగరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యుత్యాహం ప్రదర్శించారు. పుత్తూరులో బ్యాడ్మింటన్‌ కోర్టు ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే భానుప్రకాష్ అంటూ పోస్టర్లు కలకలం రేపాయి. దీంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు రాకుండానే ఎమ్మెల్యే పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేయడంపై మండిపడుతున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని రిటర్నింగ్ ఆఫీసర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భాను ప్రకాష్‌పై ఈసీ కేసు నమోదు చేసింది.

Also Read: విద్యార్థులకు అలర్ట్‌.. పాఠశాలల సమయాల్లో మార్పులు

ఇదిలా ఉంటే, నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి రోజా ఉన్న సంగతి తెలిసిందే. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా హ్యాట్రిక్ కొడుతుందని వైసీపీ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు టీడీపీ నేతలేమో గెలుపు తమదేనంటూ ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి రోజా ఎమ్మెల్యేగా గెలుస్తుందా? లేదంటే టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గెలుస్తారా అనేది జూన్ 4న తెలుస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు