రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరించాలి... స్పీకర్ ను కలిసిన అదిర్ రంజన్ చౌదరి...!

రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరించాలని లోక్‌సభ స్పీకర్‌ను కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అదీర్ రంజన్ చౌదరి కలిశారు. మోడీ ఇంటి పేరు కేసులో దాఖలైన పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించాలని కోరామని తెలిపారు. ఆలస్యం అయితే ప్రభుత్వం మరిన్ని అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరించాలి... స్పీకర్ ను కలిసిన అదిర్ రంజన్ చౌదరి...!
New Update

రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరించాలని లోక్‌సభ స్పీకర్‌ను కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అదీర్ రంజన్ చౌదరి కలిశారు. మోడీ ఇంటి పేరు కేసులో దాఖలైన పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించాలని కోరామని తెలిపారు. ఆలస్యం అయితే ప్రభుత్వం మరిన్ని అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అందువల్ల రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరించే విషయంలో జాప్యం చేయవద్దని కోరినట్టు అదీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ..... ఈ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు సత్యం విజయం సాధించిందన్నారు. నిరాధారమైన ఆరోపణలపై రాహుల్ గాంధీని కేసులో ఇరికించారని నేడు దేశం మొత్తానికి తెలిందన్నారు.

రాహుల్ గాంధీపై ప్రభుత్వం చేసిన కుట్రలన్నీ విఫలమయ్యాయన్నారు. పార్లమెంట్ లో కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వచ్చే వారం చర్చకు రాబోతోందన్నారు. ఆ తీర్మానంపై పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా అధికార పార్టీ ఎలాంటి కుట్రలు చేస్తోందో ఈ దేశ ప్రజలు వినాలన్నారు.

అంతకు ముందు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ స్పందించారు. తన పనేంటో, తన మార్గమేంటో తనకు స్పష్టంగా తెలుసన్నారు. దాని గురించి తన మనసులో స్పష్టత వుందన్నారు. తనకు సహకరించిన ప్రజలందరికీ ధన్యావాదాలు తెలిపారు. వాళ్లు అందించిన ప్రేమ, మద్దతుకు వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి