Hyderabad: అత్యంత ఖరీదైన నగరాల్లో 'హైదరాబాద్' కి ఏ స్థానామో తెలుసా!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగర జాబితా 2024 విడుదల చేసింది మెర్సెర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాకింగ్స్.హైదరాబాద్ నగరం విషయానికి వస్తే తన స్థానాన్ని అలాగే పదిలపరుచుకుంది. గతేడాది మాదిరిగానే 202వ స్థానంలో కొనసాగుతోంది భాగ్యనగరం.

New Update
Hyderabad: అత్యంత ఖరీదైన నగరాల్లో 'హైదరాబాద్' కి ఏ స్థానామో తెలుసా!

Hyderabad: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగర జాబితా 2024 విడుదల చేసింది మెర్సెర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాకింగ్స్. ఇందులో వరల్డ్ లోనే టాప్‌లో నిలిచాయి హంకాంగ్, సింగపూర్, జురిచ్ నగరాలు అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి. ఈ మూడు నగరాలు గతేడాది నుంచి తమ స్థానాన్ని పదిలంగా కొనసాగిస్తున్నాయి. అలాగే మరోపక్క జీవన వ్యయం చాలా తక్కువగా ఉన్న నగరాల్లో ఇస్లామాబాద్, లాగోస్, అబుజా నగరాలు టాప్ 3లో చోటు దక్కించుకున్నాయి.

ఈ జాబితాలో మన హైదరాబాద్ నగరం చోటు దక్కించుకుంది. మరి మన ర్యాంక్ ఎంత అనుకుంటున్నారు? భారత్‌లో చూసుకుంటే అత్యంత ఖరీదైన నగరంగా ముంబై తొలి స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముంబై ర్యాంక్ 136గా ఉంది. గతేడాదితో పోలిస్తే 11 స్థానాలు ఎగబాకింది. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉంది.

మరోవైపు.. తమిళనాడు రాజధాని చెన్నై నగరం 5 స్థానాలు పడిపోయి 189 స్థానంలో నిలవగా.. బెంగళూరు 6 పాయింట్లు కోల్పోయి 195వ స్థానానికి దిగిపోయింది. ఇక మన హైదరాబాద్ నగరం విషయానికి వస్తే తన స్థానాన్ని అలాగే పదిలపరుచుకుంది. గతేడాది మాదిరిగానే 202వ స్థానంలో కొనసాగుతోంది భాగ్యనగరం. ఇక పుణే నగరం 8 స్థానాలు మెరుగుపరుచుకుని 205వ ర్యాంక్ సాధించింది.

కోల్‌కతా నాలుగు పాయింట్లు పెరిగి 207 వ స్థానంలో నిలిచింది. మొత్తంగా భారత్‌ నుంచి 7 నగరాలు ప్రపంచ ఖరీదైన నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా 226 నగరాలను పరిశీలించి ఈ జాబితాను సిద్ధం చేసింది మెర్సెర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్.

Also read: తెలంగాణలో రాగల ఐదు రోజులు వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు