Anantnag: కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు..!

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన ముగ్గురిలో కల్నల్‌ మన్‌ప్రీత్ సింగ్ ఒకరు. తన కొడుకు మరణంతో మన్‌ప్రీత్‌ తల్లి గుండెలు పగిలేలా విలపించారు. త్వరలోనే ఇంటికి వస్తానమ్మ అని చెప్పిన తన కొడుకు మాటలు గుర్తు చేసుకుంటూ ఆ తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

New Update
Anantnag: కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు..!

'చిన్నా.. ఇంటికి ఎప్పుడొస్తావ్'..?

'ఇంతపని పెట్టుకోని ఎలా రానమ్మా?'

చూడాలనిపిస్తుంది చిన్నా..

'తప్పకుండా త్వరలోనే వస్తానామ్మా'

జమ్ముకశ్మీర్‌ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కల్నల్‌ మన్‌ప్రీప్‌ సింగ్‌ తన తల్లితో మాట్లాడిన చివరి పోన్‌ కాల్ మాటలివి. కానీ అదే తన కొడుకుతో చివరి ఫోన్‌ కాల్ అవుతుందని ఆ తల్లి ఊహించలేకపోయింది. నవ్వుతూ ఇంటికి వచ్చి హత్తుకుంటాడని భావించన ఆ తల్లి.. తన కొడుకు నిర్జీవంగా రావడంతో తల్లడిల్లిపోయింది. 'మేరా కల్నల్ షహీద్ హో గయా' అంటూ ఆ తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడిపెట్టిస్తున్నాయి.


ముగ్గురు మృతి:
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్, మేజర్, జమ్ముకశ్మీర్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ మరణించారు. కమాండింగ్ ఆఫీసర్, కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ వీరిలో ధైర్యవంతులలో ఒకరు. కుమారుడి పార్థివ పార్థివ దేహాన్ని చూసిన మన్‌ప్రీప్‌ తల్లి గుండెలు పగిలేలా రోదించింది. "ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నేను అతనితో మాట్లాడాను. మేము కొన్నిసార్లు ఒక వారం పాటు మాట్లాడుకోం. నా కొడుకు నాలుగు సంవత్సరాల నుంచి కశ్మీర్‌ లోయలో వర్క్ చేస్తున్నాడు.. త్వరలోనే బదలీ కూడా ఉంది" అని ఆర్మీ అధికారి తల్లి విలపించింది.

'నేను(తల్లి) ఇంటికి రమ్మని అడిగినప్పుడల్లా, నా కొడుకు 'నాకు చాలా పని ఉంది. నేను పనులన్నీ వదిలేసి ఎలా వస్తాను అమ్మా?' అని చెప్పేవాడట. ఈ విషయాన్ని తలుచుకుంటూ మన్‌ప్రీత్‌ తల్లి ఏడుస్తున్న తీరు అక్కడివారికి కన్నీరు పెట్టించింది. ఇక కల్నల్ తండ్రి కూడా 2014లో మరణించారు. ఆయన కూడా సైన్యంలోనే పని చేశారు.


కొనసాగుతోన్న ఉగ్రవాదుల వేట:
అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ అధికారులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరణించారు. దాడికి బాధ్యత వహించిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఆఫ్‌షూట్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్, ఈ నెల ప్రారంభంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో తమ అనుభవజ్ఞుడైన నాయకుడిని చంపినందుకు ప్రతీకార చర్యగా ఈ దాడిని పేర్కొంది. సెప్టెంబర్ 8న POKలోని రావాలకోట్ ప్రాంతంలోని అల్-ఖుదుస్ మసీదులో ఖాసిం అనే LeT కమాండర్ రియాజ్ అహ్మద్‌ను కాల్చి చంపారు. ఆయన మరణం అతని అనుచరులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇది కోకెర్‌నాగ్‌లో ప్రతీకార దాడికి దారితీసింది. అహ్మద్ తండ్రి కూడా 2005లో హతమైన ఉగ్రవాది. నిన్నటి దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అనంతనాగ్‌లో గురువారం నాడు కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇద్దరు ఎల్‌ఇటి ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు.


ALSO READ: దేశంకోసం ప్రాణాలు వదిలిన ఈ డీఎస్పీ కథ వింటే ఖచ్చితంగా సెల్యూట్ చేస్తారు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు