Office Anxiety: ఆఫీస్‌కు వెళ్లాలంటే ఆందోళన కలుగుతోందా? ఆ సమస్యను ఇలా వదిలించుకోండి..

ఆఫీస్‌కు వెళ్లాలంటే కొందరు ఎంప్లాయిస్‌లో అదోరకమైన భయం, ఆందోళన ఉంటుంది. అనేక పెండింగ్ ప్రాజెక్టులు, సీనియర్ల నుంచి పెరుగుతున్న ఒత్తిడి.. వెరసి ఉద్యోగులు ఆందోలనకు గురవుతారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. స్నేహితులతో గడపడం, సమయానికి తినడం, వ్యాయామం చేస్తూ ఉండాలి.

New Update
Office Anxiety: ఆఫీస్‌కు వెళ్లాలంటే ఆందోళన కలుగుతోందా? ఆ సమస్యను ఇలా వదిలించుకోండి..

Work Place Anxiety: ప్రస్తుత కాలంలో చాలా మంది రోజులో గరిష్ట సమయాన్ని ఆఫీసులో గడుపుతున్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకే సమయంలో అనేక పనులు కలిగి ఉండటం, సీనియర్లలో పెరుగుతున్న అంచనాలు పని చేసే చోట ఒత్తిడి స్థాయిలను పెంచుతాయి. వెరసి ఇది ఆందోళనకు దారితీస్తుంది. దీని వల్ల కొందరికి షార్ట్ టెంపర్డ్ అయితే.. మరికొందరు తలనొప్పి లేదా బాడీ పెయిన్ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ రకమైన ఒత్తిడి ప్రమాదకరంగా పరిగణించబడుతుంది. వర్క్‌ప్లేస్ యాంగ్జయిటీ వల్ల పని మీద ఏకాగ్రత పెట్టలేక అనేక ప్రతికూల ఆలోచనలు చుట్టుముడతాచపి సైకియాట్రిస్ట్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో.. కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా ఆఫీసు ఆందోళన, టెన్షన్స్ నుంచి బయటపడొచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. సకాలంలో పని పూర్తి చేయాలి..

మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేస్తే.. ఆందోళనలలో సగం ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది. వాస్తవానికి, చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతారు. ఇది వారి పనిని ప్రభావితం చేస్తుంది. అందుకే సమయం ముగిసినా పని చేస్తూ ఉండటం కంటే.. కేటాయించిన సమయంలోనే మీ పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి.

2. సన్నిహితులతో సమయం..

ఎక్కువ సమయం ఒంటరిగా గడిపే వ్యక్తులలో నిరాశ, విచారం ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే.. సమాజంతో సంబంధాలను తెంచుకోవద్దు. ఇతరుల కలిసి ఉండేందుకు ప్రయత్నించండి. స్నేహితులతో సమయం గడపండి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటారు. స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి సమయాన్ని ఆనందంగా గడపండి.

3. ప్రతికూల ఆలోచనలు వదిలేయండి..

చాలామంది తమను తాము బలహీన వ్యక్తులుగా భావిస్తుంటారు. దీని కారణంగా కూడా మానసికంగా కుంగిపోతుంటారు. ఇది స్వీయ ప్రతికూల ఆలోచనలకు దారితీస్తుంది. దీనికి బదులుగా మీ బలాలను, శక్తిని గుర్తించి.. చిన్న చిన్న విజయాలను సాధించడం ప్రారంభించండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విజయం సులభతరం అవుతుంది.

4. నెగిటీవ్ పర్సన్స్‌ని దూరంగా ఉండండి..

ప్రతి వర్క్‌ప్లేస్‌లో కొంత మంది చెడు వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఉంటారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. వారితో సమయం గడపడం వలన మీ దృష్టి, పని నుండి మరలిపోతుంది. తద్వారా మీ పనిలో మీరు వెనుకబడిపోతే.. తరువాత ఆందోళనకు గురవుతారు.

4. వ్యాయామం చేయండి..

వ్యాయామం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మిమ్మల్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తుంది. ఆఫీస్ టెన్షన్స్‌నుంచి బయటపడాలనుకుంటే.. వ్యాయామం చేయడం మర్చిపోవద్దు.

5. తగినంత నిద్ర అవసరం..

రాత్రి వేళ 8-10 గంటల పాటు నిద్రపోవడం వల్ల మనసు రిలాక్స్‌గా ఉంటుంది. అందుకే నిద్ర విషయంలో రాజీ పడకండి. నిద్రపోవడానికి కొంత సమయం ముందు ఫోన్ పక్కన పెట్టండి. ఇది నిద్ర విధానాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి-ఆందోళన సమస్యను తొలగిస్తుంది.

Also Read:

ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ రెడీ..!

పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

Advertisment
తాజా కథనాలు