కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోదీ సూచన

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజ్యసభ సభ్యులు డాక్టర్.లక్ష్మణ్ కుటుంబ సమేతంగా కలిశారు. కాంగ్రెస్, BRS పార్టీలు పార్లమెంట్ సాక్షిగా ఒక్కటైన విషయం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారని లక్ష్మణ్ తెలిపారు.

New Update
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మోదీ సూచన

అధికారంలోకి రావడం ఖాయం.. 

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజ్యసభ సభ్యులు డాక్టర్.లక్ష్మణ్ కుటుంబ సమేతంగా కలిశారు. రాజ్యసభలో తెలంగాణ రాష్ట్రంపైన వేస్తున్న ప్రశ్నలు, పాల్గొంటున్న చర్చలు బాగుంటున్నాయని.. అలాగే కొనసాగించాలని మోదీ తెలిపిటన్లు లక్ష్మణ్‌ తెలిపారు. కాంగ్రెస్, BRS పార్టీలు పార్లమెంట్ సాక్షిగా ఒక్కటైన విషయం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారన్నారు. తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలు, ఇస్తోన్న నిధులను ప్రజలకు వివరించమన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వెంట ఉన్నారని మరికొద్దిగా కష్టపడితే అధికారంలోకి రావడం ఖాయమని.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తానని మోదీ చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

publive-image

లక్ష్మణ్‌ అడిగి ప్రశ్నలకు సమాధానం..

మరోవైపు రాజ్యసభలో సింరేణి సంస్థ గురించి లక్ష్మణ్‌ అడిగి ప్రశ్నలకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశ అవసరాల కోసం కావాల్సిన బొగ్గు మొత్తం దేశంలోనే ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు. 2022-23 లో బొగ్గు ఉత్పత్తి 14.77 శాతం పెరిగిందన్నారు. 2023-24 లో లో జూన్ వరకు దేశీయ బొగ్గు ఉత్పత్తి 8.57 శాతం పెరిగినట్లు వివరించారు. 2023-24 సంవత్సరానికి గాను బొగ్గు ఉత్పత్తి టార్గెట్ 1012.14 టన్నులుగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అందులో కోల్ ఇండియా సంస్థల నుంచి 780 టన్నులు, సింగరేణి సంస్థ నుంచి 70 టన్నులు, ఇతర సంస్థల నుంచి 162.14 టన్నులు గా ఉన్నట్టు తెలిపారు. 2022-23 గాను విద్యుత్ ఉత్పత్తి కోసం 738 మిలియన్ టన్నులు బొగ్గు అవసరం అయిందన్నారు. తెలంగాణలోని భద్రాద్రి పవర్ ప్లాంట్ పురోగతి వివరాలు యూనిట్‌ల వారీగా జాబితాలో ఉన్నాయని కేంద్రమంత్రి లేఖలో తెలిపారు.

తెలంగాణపై ప్రత్యేక దృష్టి.. 

మరో మూడు, నాలుగు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించారు. సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. అలాగే రాష్ట్ర కీలక నేతలతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తరచుగా భేటీ అవుతున్నారు. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయాలని భావిస్తున్నారు. దీంతో త్వరలోనే మోదీ, షాతో పాటు ఇతర కీలక నేతలందరూ తెలంగాణలో పర్యటనలు చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు