YCP: ఓటు వేయకపోతే ఇలా చేయండని చెప్పడం విడ్డూరం: ఎమ్మెల్యే తమకు ఓటు వేయకపోతే భర్తలకు అన్నం పెట్టవద్దంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. వైసీపీని చూసి కూటమి పార్టీలు భయపడుతున్నాయని ఎద్దేవ చేశారు. By Jyoshna Sappogula 27 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Mekapati Vikram Reddy: నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తన రాజకీయ ప్రచారానికి నేటి నుండి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారలో భాగంగా తన నియోజకవర్గం లోని ఏ. ఏస్. పేట మండలం కుప్పురుపాడు ఆత్మకూరు మండలం వాసిలి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఈ గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఇక్కడి ప్రజలు అభిమానులు భారీగా ఊరేగింపులో పాల్గొని స్వాగతం పలికారు. గ్రామాల్లో తిరుగుతూ తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ నియోజకవర్గంలో తనను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి తిరిగి తమ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీని చూసి కూటమి పార్టీలు భయపడుతున్నాయని ఎద్దేవ చేశారు. తాము చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోవడం మానేసి తమకు ఓటు వేయని భర్తలకు అన్నం పెట్టవద్దంటూ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించడం వింతగా ఉందన్నారు. Also Read: జగన్ కు మద్దతుగా విజయమ్మ..కొడుకుని హత్తుకుని భావోద్వేగం వాలంటీర్లను టెర్రరిస్టులుగా టీడీపీ నేతలు అనడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది సరైన విధానం కాదని తమ పార్టీని చూసి భయపడి ఇటువంటి అనవసరపు మాటలు వాడుతున్నారని దానికి ప్రజలు సరైన తీర్పు ఇస్తారని తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే నేడు తిరిగి తమ విజయానికి నాంది పలుకుతాయని అన్నారు. కూటమి పార్టీలు సమావేశమైన రోజు అమావాస్య అన్న సంగతి వారికి తెలియదేమో అటువంటి రోజు సమావేశం పెట్టుకొని మైకులు ఆఫ్ అయిపోయి కరెంటు లేకపోవడం మంచి శుభసూచకంగా కూటమి కార్యక్రమాలు ప్రారంభించారని వ్యంగ్యంగా తెలిపారు.. #mekapati-vikram-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి