Mehreen Pirzada : మీడియా సంస్థలపై మండిపడ్డ 'ఎఫ్2' హీరోయిన్.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ?

మెహ్రీన్ రీసెంట్ గా ఎగ్ ఫ్రీజింగ్ గురించి వివరిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. దానిపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాయగా.. దీనిపై మెహ్రీన్ స్పందిస్తూ.. ఆ మీడియా సంస్థలపై అసహనం వ్యక్తం చేసింది. తనపై పెట్టిన పోస్టులు తొలగించి బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది.

Mehreen Pirzada : మీడియా సంస్థలపై మండిపడ్డ 'ఎఫ్2' హీరోయిన్.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ?
New Update

Actress Mehreen Fires On Media : టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ తాజాగా పలు మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే తాను సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాశాయని, వాళ్ళు తనకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేసింది.

వాళ్ళు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే

మెహ్రీన్ రీసెంట్ గా తన సోషల్ మీడియాలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి వివరిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. దానిపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాయగా.. తాజాగా దీనిపై మెహ్రీన్ స్పందిస్తూ.. ఆ మీడియా సంస్థలపై అసహనం వ్యక్తం చేసింది." మీడియా సంస్థల్లో పనిచేసే వారు వాళ్ళ వృత్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది.

Also Read : ఆ హీరో కోసమే ఐటెం సాంగ్ లో నటించాను.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన కాజల్ అగర్వాల్!

సరిగ్గా అర్థం చేసుకొని వార్తలు ప్రచురించండి. తప్పుడు సమాచారం ప్రజలకు అందించడం అనైతికమే కాదు చట్ట విరుద్ధం కూడా. ఇటీవల నేను పెట్టిన ఫ్రీజింగ్ ఎగ్స్ పోస్ట్ పై కొందరు రకరకాల వార్తలు రాశారు. నేను ధైర్యం చేసి ఈ విషయం గురించి మాట్లాడాను. ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం అమ్మాయిలు ప్రెగ్నెంట్ కావాల్సిన అవసరం లేదు. ఓ సెలెబ్రిటీగా కొందరికి దీని గురించి అవగాహన కల్పించడం కోసం ఆ పోస్ట్ పెట్టాను.

అప్పుడే పిల్లలు వద్దు అనుకునే వారికి ఈ ఎగ్ ఫ్రీజింగ్ యూజ్ అవుతుంది. ఇది తెలియకుండా మీ స్వార్థం కోసం తప్పుడు వార్తలు రాశారు. నేను ప్రెగ్నెంట్ అని ప్రచారం చేశారు.ఇప్పటికైనా ఇలాంటి వార్తలకు పులిస్టాప్ పెట్టకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నాపై పెట్టిన పోస్టులు తొలగించి బహిరంగ క్షమాపణలు చెప్పండి" అని డిమాండ్ చేసింది. దీంతో మెహ్రీన్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

#mehreen-pirzada #actress-mehreen
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe