Aleti Maheshwar Reddy: రూ.1,100 కోట్ల మేఘా స్కామ్.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి సంచలన వ్యాఖ్యలు TG: రాష్ట్ర ప్రభుత్వం మేఘా సంస్థతో చీకటి ఒప్పందాలు పెట్టుకుందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పబ్లిక్ డొమైన్‌లో జీవో పెట్టకుండా సొంత జిల్లాలో సీఎం రేవంత్ మేఘా కృష్ణారెడ్డికి రూ.1100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని నిలదీశారు. దీనిపై రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 11 Jul 2024 in Latest News In Telugu ఆదిలాబాద్ New Update షేర్ చేయండి Alleti Maheshwar Reddy: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకొని జీవోలు తెచ్చి బలవంతపు వసూళ్లు చేస్తుందని అన్నారు. కేంద్రం నుంచి అమృత్ స్కీమ్ లో రూ. 3 వేల కోట్ల కాంట్రాక్టర్ల లో అవినీతి కి పాల్పడ్డారని ఆరోపించారు. దీన్ని మూడుగా డివైడ్ చేసి వెయ్యి కోట్లకు ఒక్కరిగా కాంట్రాక్టు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మేఘా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారని చెప్పారు. ఎక్సైజ్ కుంభకోణంలో ఉన్న రేవంత్ బామ్మర్ది సృజన్ అనే వ్యక్తీ కి చెందిన శోధ కంపెనీకి రూ. 400 వందల కోట్ల కాంట్రాక్టర్ ఇచ్చారని ఆరోపించారు. రూ. 600 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్ట్ ను వెయ్యి కోట్లకు ఇచ్చినట్లు చెప్పారు. 30 నుంచి 35 శాతం తక్కువకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్ పొంచి కాంటాక్ట్స్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మొత్తం కలిపి రూ.1200 కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. ఏ ఒక్క జీవో ను కూడా ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదని ఫైర్ అయ్యారు. మేఘా కృష్ణారెడ్డికే ఎందుకు?. మేఘ కృష్ణ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏలేటి మహేశ్వర రెడ్డి. సీఎం సొంత జిల్లాలోనే మేఘా కృష్ణారెడ్డికి రూ.1100 కోట్ల కాంటాక్ట్ పనులు ఇచ్చారని అన్నారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? అని ప్రశ్నించారు. మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు ప్రాజెక్ట్ ఇచ్చారు? అని నిలదీశారు. మేఘా కృష్ణారెడ్డి మీద కాళేశ్వరం ఎంక్వైరీ జరుగుతుంది కదా? అని అన్నారు. ఆయన మీద జ్యుడీషియల్ ఎంక్వైరీ నడుస్తుందని అన్నారు. ఆయన కంపెనీ నీ బ్లాక్ చేయకున్నా కాంట్రాక్టు ఎలా ఇచ్చారు? అని మండిపడ్డారు మేఘా కృష్ణారెడ్డితో తెలంగాణ సొమ్ము కక్కిస్తాను చెప్పి ... ఆయనకు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనకున్న మతలబు ఏమిటి? అని అడిగారు. మేఘా కృష్ణారెడ్డికి మీకున్న సంబంధం ఎంటి? అని నిలదీశారు. కరీంనగర్ లో సీఎం తమ్ముడు పార్టనర్ అని చెప్తున్నారని చెప్పారు. రాబోయే కొడంగల్ టెండర్లలో కూడా మేఘా కు పెద్ద పీట వెయ్యబోతున్నారని అన్నారు. దీనికి ఎస్టిమేట్ ప్రయివేట్ ఇంజనీర్లు తో వేయించుకుంటున్నారని తెలిపారు. తాను అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. #alleti-maheshwar-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి