Megha Gas: అమ్మకానికి మేఘా గ్యాస్ కంపెనీ.. డీల్ కుదురుతుందా? మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మేఘా గ్యాస్ కంపెనీని అమ్మకానికి పెట్టినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే మేఘా గ్యాస్ కంపెనీ విలువను మదింపు చేయడం.. భారత ప్రభుత్వ ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు పూర్తి అయ్యాయని ఆ కథనం పేర్కొంది. By KVD Varma 28 May 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Megha Gas: మేఘా ఇంజనీరింగ్ కంపెనీ తన ఆస్తులు, వ్యాపారాలు అమ్మేసుకోవాలని ప్రయత్నిస్తోందా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ప్రముఖ బిజినెస్ వెబ్సైట్ "ది ఎకానమిక్ టైమ్స్" మేఘా కంపెనీల అమ్మకాల పరిస్థితిపై సంచలన కథనం ప్రచురించింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ తన గ్యాస్ బిజినెస్ ను అమ్మేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ కథనం పేర్కొంది. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వ సంస్థలు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, ఇంద్రప్రస్థ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే.. ఆ కంపెనీలు ఈ ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తున్నాయి. నిర్ణయం తీసుకోవడం విషయంలో ఆచి, తూచి వ్యవహరిస్తున్నాయి. Megha Gas: ఇప్పటికే మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. చాలా ఆరోపణల విషయంలో సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో తన గ్యాస్ కంపెనీని అమ్మేయాలని మేఘా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇంతకు ముందే మేఘా కొన్ని కంపెనీలను అమ్మేయాలని అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, అవేవీ నిర్ధారణ కాలేదు. కానీ, ఇప్పుడు జాతీయ మీడియాలో మేఘా గ్యాస్ కంపెనీ అమ్మేయబోతోందని కథనం రావడంతో చర్చనీయాంశంగా మారింది. Also Read:ఈ రాత్రి ఒక్కొక్కడికి శివాలెత్తిపోద్ది.. విశ్వక్ కోసం బాలయ్య ఎంట్రీ..! Megha Gas: ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో మేఘా ఇంజనీరింగ్ ఇరుక్కుపోయింది రాజకీయ పార్టీలకు 1200 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చినట్టు నిర్ధారణ కావడం ఈ కంపెనీకి చిక్కులు తెచ్చింది. అందులోనూ కేవలం బీజేపీకే 960 కోట్ల విరాళాలు ఇవ్వడంపై అందరిలోనో చాలా అనుమానాలను రేకెత్తించింది. ఇదిలా ఉంటె, NMDC నుంచి బిల్లుల చెల్లింపు కోసం లంచాలు ఇచ్చారన్న కేసు కూడా మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి చిక్కులు తెచ్చింది. ఈ కేసును ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇలా కేసుల్లో ఇరుక్కుని ఉన్న మేఘా తన గ్యాస్ కంపెనీని అమ్మకం చేయాలనీ ప్రయత్నిస్తూ.. ప్రభుత్వ రంగ కంపెనీలను సంప్రదిస్తోంది. అయితే, ఆ కంపెనీలు మేఘా వెనుక ఉన్న కేసుల నేపథ్యంలో వెనకడుగు వేస్తున్నాయని తెలుస్తోంది. Megha Gas: ఇక మరోవైపు మేఘా కంపెనీ తన గ్యాస్ కంపనీని అమ్మడం కోసం కంపెనీ విలువను నిర్ధారించే పనిలో ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ విలువను 1000 నుంచి 2000 కోట్ల రూపాయలుగా చెబుతున్నారని తన కథనంలో పేర్కొంది ఎకనామిక్స్ టైమ్స్. కంపెనీ విలువ పైన కూడా మేఘా సంప్రదించిన కంపెనీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. అందుకే, ఈ డీల్ విషయంలో ఆ కంపెనీలు ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా మేఘ ఇంజనీరింగ్ కంపెనీ తన గ్యాస్ కంపెనీని అమ్ముకుంటోంది అనే వార్త ప్రస్తుతం బిజినెస్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది. #megha-engineering #megha #megha-gas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి