Megha Scam: బీజేపీకి మేఘా నుంచి భారీగా విరాళాలు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో మేఘా సంస్థ నుంచి బీజేపీకి రూ. 584 కోట్లు విరాళాలు వెళ్లిన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. BRSకు మేఘా రూ.195 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చింది. అటు డీఎంకేకు మేఘా నుంచి రూ.85 కోట్లు వెళ్లగా.. వైసీపీకి మేఘా రూ.37 కోట్లు విరాళాలు వెళ్లాయి.

Megha Scam: బీజేపీకి మేఘా నుంచి భారీగా విరాళాలు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
New Update

ఎలక్టోరల్‌ బాండ్ల డేటా రోజూ ప్రకంపనలు రేపుతోంది. ఎస్‌బీఐ డేటాను ఈడీ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ప్రతీసారి మేఘా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. బీజేపీకి వచ్చిన విరాళాల్లో ఎక్కువ భాగం హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌దే. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఎస్‌బీఐ అందించిన సమాచారం ఆధారంగా రూ.12,146 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లల్లో సగానికి సగం బీజేపీకే వెళ్లాయి. మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి బీజేపీకి రూ. 584 కోట్లు విరాళాలు వెళ్లిన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. BRSకు మేఘా రూ.195 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చింది. అటు డీఎంకేకు మేఘా నుంచి రూ.85 కోట్లు వెళ్లగా.. వైసీపీకి మేఘా రూ.37 కోట్లు విరాళాలు వెళ్లాయి.

మేఘా భారీ స్కామ్:
ఎలక్టోరల్‌ బాండ్ల డేటా చూస్తే మేఘా అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అవినీతి సొమ్మును కూడబెట్టుకున్న మేఘా కృష్ణారెడ్డి ఆ అక్రమ సొమ్ము వాటాను రాజకీయా పార్టీలకు విచ్చలవిడిగా పంచారు. ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలు చూసి యావత్‌ దేశం షాక్‌ తిన్నది. ఈ ఒక్క కంపెనీనే ఏకంగా రూ.966 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఇది కాకుండా మేఘా అనుబంధ కంపెనీలు కూడా భారీగా ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయి.

కాళేశ్వరం.. అతిపెద్ద కుంభకోణం:
కాళేశ్వరం స్కామ్‌ దేశంలోనే అది పెద్ద కుంభకోణం. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మేఘా కృష్ణా రెడ్డి 48,000 కోట్లు స్వాహా చేశారని కాగ్‌ నివేదిక చెబుతోంది. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కోసం 1,05,000 కోట్లు విడుదలవగా.. ఇందులో దాదాపు 50శాతం సొమ్ము మేఘా జేబులోకి అక్రమంగా వెళ్లినట్టు కాగ్ గుర్తించింది. మేఘా కృష్ణారెడ్డి ఎందుకు ఇన్ని వందల కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేశారు? ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరిగిన, జరిగే అవకాశమున్న కంపెనీలే ఎక్కువగా బాండ్లు కొనుగోలు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. అంటే అవినీతికి భారీగా పాల్పడిన వారే వందల కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారానన్న అనుమానం వస్తోంది. నిజానికి మేఘా సంస్థకి అవినీతి మరకలు అంటుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. తెలంగాణలో డ్యామ్‌లు, రోడ్లు , విద్యుత్ రవాణా.. ఇలా ప్రతీదాన్ని దాదాపు 90శాతం ప్రాజెక్టులను 50శాతం మార్జిన్‌తో మేఘా పొందారని ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా లాంటి నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేశారు. గత పదేళ్లలో తెలంగాణ ప్రాజెక్టుల నుంచి 72 వేల కోట్ల రూపాయలను మేఘా స్వాహా చేసినట్టుగా షర్మిలా ఆరోపించారు.

Also Read: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ!

#electoral-bonds #megha-krishna-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe