ఎలక్టోరల్ బాండ్స్ డేటా రిలీజ్ తర్వాత ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ.. రెండోది మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL). ఇందులో మేఘా పేరు అందరికి సుపరిచితమే. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులకు ఈ సంస్థ భాగస్వామ్యం ఉంది. ఇక అత్యధికంగా విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన వారిలో మేఘా సంస్థ రెండో ప్లేస్‌లో ఉంది. మొత్తం రూ.966 విలువైన ఎలక్టోరల్ బాండ్లు మేఘా సంస్థ పేరిట కొనుగోలైనట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇక మేఘా అనుబంధ సంస్థలు కూడా బాండ్లను కొనుగోలు చేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా మేఘాతో లింకప్ అయిన కంపెనీల బాండ్ల వివరాలన్ని లెక్కిస్తే ఓవరాల్‌గా మేఘానే టాప్ కొనుగోలుదారుడుగా తెలుస్తోంది. ఇలా మేఘా గురించి అనేక కథనాలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ప్రముఖ వార్త సంస్థ 'The Indian Express(ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్) ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లీ మహారాష్ట్ర ప్రాజెక్ట్‌ను పొందే ముందు రూ. 140 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను మేఘా కొనుగోలు చేసినట్టు ఈ వార్త క్లైయిమ్ చేస్తోంది.
సరిగ్గా నెల ముందు:
గతేడాది(2023) ఏప్రిల్‌లో మహారాష్ట్రలో 14,400 కోట్ల థానే-బోరివాలి జంట సొరంగం ప్రాజెక్ట్‌ను టెండర్ ద్వారా మేఘా సంస్థ గెలుచుకుంది. ఇది జరగడానికి ఒక నెల ముందు మేఘా సంస్థ రూ.140 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌ను కొనుగోలు చేసినట్టు ECI డేటా చూపిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వ ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) గతేడాది జనవరిలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కింద రెండు రోడ్డు సొరంగాలు - ప్రాజెక్ట్ కోసం టెండర్‌ను దాఖలు చేసింది. దీనికి ఏకైక బిడ్డర్ మేఘా(MEIL).
రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలిచ్చిన టాప్ కంపెనీల్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ కూడా ఒకటి. వివిధ రాజకీయ పార్టీలకు రూ.699 కోట్లను విరాళంగా ఇచ్చింది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. ఇక విరాళాల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ నిలిచింది. వివిధ రాజకీయ పార్టీలకు దాదాపుగా రూ. 2177 కోట్లు విరాళంగా ఇచ్చింది. అత్యధికంగా బీజేపీకి రూ. 11562 కోట్ల విరాళాలు అందాయి. బీజేపీ తరువాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.3214 కోట్ల విరాళాలు అందాయి.
Also Read: రేపు మధ్యాహ్నం 3గంటలకు లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటన!