మెగా ఫ్యామిలీని వీడని VVV మిస్టరీ

మెగా ఫ్యామిలీలో ఈమధ్య కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. జరుగుతున్న ఈ సంఘటనలు చూస్తుంటే బాధపడాలో, సంతోషపడాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని మెగా ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం చిరంజీవి తమ్ముడు, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నిశ్చితార్థం నటి లావణ్య త్రిపాఠితో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

New Update
మెగా ఫ్యామిలీని వీడని VVV మిస్టరీ

megastar-family-nagababu-daughter-konidela-niharika-divorce-disappoint-mega-fans1

తమ ఇంట్లో ఒక మహాలక్ష్మి అడుపెట్టబోతుందని సంతోష పడేలోపే, మరో మహాలక్ష్మి అడుగుపెట్టేసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చారు. ఆమెకి క్లింకారా కొణిదెల అని నామకరణం కూడా చేశారు. చిరంజీవి తన మనవరాలిని చూసి ఎంతో మురిసిపోయి, తమ ఇంట్లోకి ఆడపిల్ల వచ్చింది, అందుకే అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక వరుణ్ - లావణ్యల పెళ్లి అలాగే క్లింకార ఊయల ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా చేయాలని అనుకుంటుండగానే మెగా ఫ్యామిలికి మరో కొత్త సమస్య వచ్చిపడింది.

చాలాకాలంగా, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల తన భర్తతో దూరంగా వుంటున్నారనే వార్తలు హల్‌చల్ అవుతూనే ఉన్నాయి. నిహారికకు,చైతన్య జొన్నల గుడ్డతో 2020లో పెళ్లి జరిగింది. ఎంతో గ్రాండ్ గా మెగా కూతురికి మెగా ఫ్యామిలీ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిపించారు. కానీ.. వారి బంధం మూడునాల్లా ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్ళైన 2ఏళ్లకే మనస్పర్థల కారణంగా, నిహారిక - చైతన్య విడాకులకు అప్లై చేసుకున్నారు. కోర్టు కూడా వీరిద్దరికి విడాకులు అనౌన్స్ చేసేసింది. దీనితో మెగా అభిమానులు విచారం వ్యక్తం చేశారు. ఎందుకంటే నాగబాబు ఇంట్లో, ఒక వైపు కొడుకు పెళ్ళి, మనవరాలి ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతుంటే, ఇంకో వైపు కూతురు నిహారిక ఇలా విడాకులు తీసుకోవటం, ఇదే సమయంలో ఆ వార్త బయటకి రావటం, మెగా అభిమానులని కొంత నిరాశ పరిచిందనే అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు