Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్‌కి మరో బ్యాడ్ న్యూస్.. మెగాస్టార్‌కి అత్యవసర శస్త్ర చికిత్స..!! మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది. మెహెర్ రమేశ్ డైరెక్షన్ వచ్చిన ఈ మూవీ బిగ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే చిరంజీవి ఇప్పుడు అత్యవసరంగా ఓ సర్జరీ చేయించుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. By Bhoomi 14 Aug 2023 in సినిమా New Update షేర్ చేయండి మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వేదాళం రీమేగ్ భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటించింది. అయితే ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గత కొంత కాలంగా మోకాలు నొప్పితో బాధపడుతున్నారని...అది ఈ మధ్య ఎక్కువగ ఇబ్బంది పెడుతుండటంతో మోకాలు ఆపరేషన్ చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ఢిల్లీలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో జరగునున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిరంజీవి పూర్తిగా రెండు నెలలపాటు రెస్టు తీసుకోనున్నారు. సినిమా షూటింగులకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా గురించి మాట్లాడుకుంటే...వాల్తేరు వీరయ్యతో మంచి టాక్ అందుకున్న తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ సినిమా చూసిన నెటిజన్లు మాత్రం సినిమాలోనికొన్ని సన్నివేశాలపై ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కొందరు అవుట్ డేట్ అంటు.మరికొందరు ఎప్పుడో పదేళ్ల క్రితం తీయాల్సిన సినిమా అంటూ కామెంట్లు చేశారు. అసలు ఈ సినిమాలో మంచి సీన్స్ లేవని...కామెంట్స్ చేస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన 'భోళా శంకర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు వసూలు చేయగా.., సీడెడ్‌లో రూ. 12 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.60 కోట్ల మేర వ్యాపారం జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.60 కోట్ల బిజినెస్ చేసుకోగా... కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు వ్యాపారం జరుపుకుంది. 'భోళా శంకర్'కు ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజు రెస్పాన్స్ చాలా వరకు తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 1.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 55 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో కలిపి.. రూ. 3.13 కోట్లు షేర్, రూ. 5.25 కోట్లు గ్రాస్ వచ్చింది. రెండు రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 18.51 కోట్లు రాబట్టిన మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ అంతగా రాణించడం లేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.12 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.98 కోట్లు షేర్, రూ. 34.20 కోట్లు గ్రాస్ రాబట్టింది. #chiranjeevi #underwent-surgery మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి