/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chir-jpg.webp)
Mega Star Chiranjeevi: గణపథ్ తెలుగు వెర్షన్ టీజర్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ప్రియాతి ప్రియమైన టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అన్నింటికి మించి నా గురువు అమితాబ్ బచ్చన్ నటించిన గణపథ్ చిత్రం టీజర్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ చిత్రం విజయం సాధించాలంటూ చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.
Delighted to share the Telugu teaser of Dearest Tiger, Kriti Sanon and above all my Guru Amit Ji’s #Ganapathhttps://t.co/ptSZaFUwK7
Wishing the entire team a spectacular success!!
#Ganapath in cinemas this… pic.twitter.com/ZrsIVKG8ZT— Chiranjeevi Konidela (@KChiruTweets) September 29, 2023
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో గణపథ్ మూవీ వస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రానుంది. కాగా, గణపథ్ మూవీ టీజర్ నేడు రిలీజ్ అయింది. ఫ్యూచరస్టిక్ యాక్షన్ సినిమాగా ఉంటుందని తెలుస్తోంది. పూజా ఎంటర్టయిన్ మెంట్, గుడ్ కో ప్రొడక్షన్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రానికి వికాస్ బెహెల్ దర్శకుడు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గణపథ్ మూవీ స్టోరీ 2070 సంవత్సరం (2070 AD)లో జరిగే కథ అని టీజర్ ఓపెనింగ్‌లోనే ఉంది. ప్రైవేట్ మిలటరీ డ్రెస్‌లు వేసుకున్న కొందరు ప్రజలను.. వేధిస్తుంటారు. వారిని రక్షించేందుకు వీరుడు వస్తాడని అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఉంది. అప్పుడు గణపథ్ (టైగర్ ష్రాఫ్) ఇంట్రడక్షన్ ఉంది. ప్రజలను కాపాడే బాధ్యతను అతడు తీసుకుంటాడని తెలుస్తోంది. హీరోయన్ కృతి సనన్ కూడా యాక్షన్ అవతార్‌లో కనిపించారు. మొత్తంగా ఫ్యూచరస్టిక్ యాక్షన్ మూవీగా గణపథ్ ఉండనుందని టీజర్‌తో అర్థమవుతోంది. ఈ టైటిల్‌కు ఏ హీరో ఈజ్ బార్న్ అనే క్యాప్షన్ ఉంది.
Also Read: సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ చేసిన కామెంట్స్ వైరల్.. కేంద్ర ప్రభుత్వం సీరియస్..!