Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అశ్వప్రేమికుడన్న సంగతి ప్రత్యుకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు గుర్రాలంటే ఎంతో ఇష్టం. గతంలో తన పేరిట ఆర్సీ హైదరాబాద్ పోలో క్లబ్ ను కూడా రామ్ చరణ్ నిర్వహించారు. గుర్రాలతో ఆడే పోలో క్రీడలో ఆయన టీమ్ అనేక చాంపియన్ షిప్ పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. రామ్ చరణ్ స్వతహాగా మంచి హార్స్ రైడర్. 'మగధీర' చిత్రంలో అలవోకగా గుర్రంపై స్వారీ చేయడం ఆయన అభిరుచికి అద్దం పడుతుంది.
కాగా, ఇప్పటికీ రామ్ చరణ్ కు గుర్రాలతో అనుబంధం కొనసాగుతోంది. ఆయన తన ఫామ్ హౌస్ లో పలు ఉత్తమ జాతి అశ్వాలను పోషిస్తున్నారు. తాజాగా వాటిలో 'బ్లేజ్' కూడా వచ్చి చేరింది. బ్లేజ్.. నా కొత్త ఫ్రెండ్ అంటూ ఓ మేలుజాతి గుర్రం ఫొటోను టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పంచుకున్నారు. ఆ అశ్వం పక్కనే రామ్ చరణ్ నిలుచుని ప్రేమగా దాన్ని నిమురుతున్న పోటోను షేర్ చేశాడు.
రిసెంట్ గా రామ్ చరణ్ గాయపడటంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమా షూటింగ్ ముందుకు సాగకపోవడంతో మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ చెర్రీ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబుతో మూవీ పెండింగ్ లో పడిపోయింది. మూవీ వర్గాల ప్రకారం.. ఇప్పటికే గేమ్ ఛేంజర్ 40 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది.
కాగా, దాదాపు రూ.90 కోట్ల భారీ బడ్జెట్ తో పాటల చిత్రీకరణ పూర్తయింది. మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసి కనీసం సమ్మర్ లో అయినా గేమ్ ఛేంజర్ రిలీజ్ చేయాలని చెర్రీ ఆశిస్తున్నాడు. ఈ సినిమా హిట్టయితే తన రెండేళ్ల శ్రమ, ఎదురు చూపులు ఫలిస్తాయన్న ఆశతో చరణ్ ఉన్నాడు.
Also Read: మెగా ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు.. వరుణ్ లావణ్య ల పెళ్లి డేట్ ఫిక్స్ ..?