సాయిధరమ్ తేజ్‌ వర్సెస్ వైసీపీ ఫ్యాన్స్ ట్విట్టర్ వార్..

సాయి ధరమ్ తేజ్, వైసీపీ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఏపీ భద్రమైన చేతుల్లో ఉందని గతంలో తేజ్ ట్వీట్ చేయగా.. వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నలు సంధించారు. దీనికి తేజు ఎగ్‌పఫ్ అని కామెంట్ పెట్టాడు. దీంతో ఎగ్‌పఫ్‌ కామెంట్స్‌పై ఆధారాలు బయటపెట్టాలని వైసీపీ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.

New Update
సాయిధరమ్ తేజ్‌ వర్సెస్ వైసీపీ ఫ్యాన్స్ ట్విట్టర్ వార్..

Sai Dharam Tej Vs YCP Fans : మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - వైసీపీ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఏపీ భద్రమైన చేతుల్లో ఉందని గతంలో తేజ్ ట్వీట్ చేయగా.. తాజాగా తేజ్ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నలు సందిచారు. ' రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే మెడలు రుద్దే మీ సేఫ్ హ్యాండ్స్‌ ఎక్కడా? అన్నా క్యాంటీన్లలో ప్లేట్లు కడుక్కోవచ్చు కదా మీ సేఫ్ హ్యాండ్స్‌తో' అంటూ సాయిధరమ్‌తేజ్‌పై వైసీపీ అటాక్ చేసింది.

Also Read : ‘ఇంద్ర’ మూవీ టైం లో చిరంజీవి ఏజ్ ఎంతో తెలుసా?

దీనికి తేజు.. కౌంటరిస్తూ ఎగ్‌పఫ్ అని కామెంట్స్ పెట్టాడు. దీంతో ఎగ్‌పఫ్‌ కామెంట్స్‌పై ఆధారాలు బయటపెట్టాలని వైసీపీ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జనసేన - వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. సాయి ధరమ్ తేజ్ కు సపోర్ట్ గా నిలుస్తూ జనసేన ఫాలోవర్స్ వైసీపీ పై ట్విట్టర్ లో మాటల దాడికి దిగారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు