/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-82-1.jpg)
Sai Dharam Tej Upcoming Movie SDT18: మెగా హీరో సాయి ధరమ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. గతేడాది విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న తేజ్ మరో స్పెషల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
MY NEXT #SDT18 ✊
This one will be more than special.Need all your love & blessings 🙏🏼
All the best to us @rohithkp_dir 🤗
Glad to be associating with @niran_reddy @chaitanyaniran & @Primeshowtweets pic.twitter.com/wFhvFAELZb
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 21, 2024
SDT18 అనౌన్స్మెంట్
SDT18 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ SDT18 పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన కెరీర్ లో ఈ సినిమా మరింత స్పెషల్ గా ఉండబోతున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న SDT18 తొలిషెడ్యూల్ ఇప్పటికే మొదలైనట్లు తెలిపారు మేకర్స్.